నాడు నేడు.. ఏపీపై వైరల్‌గా మారిన పోస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో గత ఆరు నెలలుగా పరిస్థితులు వేగంగా మారిపోయాయి.

జగన్మోహన్‌రెడ్డి బంపర్‌ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని ఏదో చేసేస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూశారు.

కానీ దానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి.రాష్ట్ర భవిష్యత్తు మొత్తం అంధకారమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడో పోస్ట్‌ వాట్సాప్‌లో వైరల్‌ అవుతోంది.గతేడాది ఈ సమయానికి ఏపీలో ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతోందో చెబుతూ సాగిన పోస్ట్‌ అది.2018 డిసెంబర్‌ సంగతి చూస్తే.పోలవరం నిర్మాణం పరుగులు పెడుతోంది.

కలల రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంది.అనంతపురంలో కియా మోటార్స్‌ మేడిన్‌ ఏపీ కార్ల తయారీని ప్రారంభించింది.

Nadu Nedu Chandra Babu Jagan
Advertisement
Nadu Nedu Chandra Babu Jagan-నాడు నేడు.. ఏపీపై వై

పట్టిసీమ నీళ్లు రైతుల ఆదాయాన్ని భారీగా పెంచేసింది.ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉంది.ఒకరకంగా ప్రపంచం దృష్టంతా ఏపీ, అమరావతివైపే ఉంది.

అయినా ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌, ఐవైఆర్‌ కృష్ణారావు, జీవీఎల్‌ నరిసింహారావు, ఉండవల్లి, చలసానిలాంటి వాళ్లు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసేవాళ్లు.కానీ సరిగ్గా ఏడాది తిరిగిన తర్వాత పోలవరం ప్రశ్నార్థకమైపోయింది.

అమరావతిని శ్మశానం చేసేశారు.ఆదాయం లేదు.

ఇసుక దొరకడం లేదు.నిర్మాణ రంగం పూర్తిగా పడకేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

రాష్ట్రమంతా అల్లకల్లోలం.అయినా అప్పుడు చంద్రబాబును విమర్శించిన నోళ్లు.

Advertisement

ఇప్పుడు ఎందుకు మూతపడ్డాయి.ఇప్పుడు ఎందుకు ఎవరూ నోరు మెదపడం లేదు.

ఈ మేధావులంతా ఎక్కడికెళ్లారు.మీకు దక్కాల్సిన ప్యాకేజీలు మీకు దక్కాయా? లేక అప్పుడు మీకున్న కుల ద్వేషం, కడుపు మంట ఇప్పుడు చల్లారిందా అంటూ చాలా ఘాటైన పదజాలంతో ఉన్న ఆ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

తాజా వార్తలు