పవన్ అత్తకు షాక్ ఇచ్చిన ప్రిన్స్

ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్స్ కన్నా స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్లు చేసే వారి డిమాండ్ పెరిగిపోతుంది.వారి డిమాండ్ పెరగటంతో కొండెక్కి కూర్చుంటున్నారు.

ఏ మాత్రం రాజీకి రావటం లేదు.అలనాటి హీరోయిన్ నదియా పవన్ కి అత్తగా నటించటంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఆమె నటించిన సినిమాలు కూడా హిట్ కావటంతో సినిమా సినిమాకి రేటును పెంచేస్తుంది.నదియా ఇలా పెంచేయటంతో ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది.

ప్రిన్స్ మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మహేష్ తల్లి పాత్ర కోసం నదియాను అడిగారట.ఆమె అడిగిన పారితోషికానికి దిమ్మ తిరిగి ఆమెను పక్కన పెట్టి ఆ స్థానంలో బిచ్చ‌గాడు ఫేమ్ దీపా రామానుజ‌న్ ను తీసుకున్నారు.

Advertisement

ఏమైనా హీరోయిన్స్ స్థాయిలో పారితోషికం అడగటంలో ఏమి న్యాయం ఉంది.పవన్ అత్తగా నటించిన నదియా పట్ల మొదట మహేష్ కూడా మోజుగా ఉన్నాడట.

అయితే ఆమె రేటు చూసి ఖంగు తిని నదియా బదులు వేరే వారిని తీసుకుందామని చెప్పాడట.బిచ్చగాడు సినిమా హిట్ కావటంతో ఆ సినిమాలో తల్లిగా నటించిన దీపా రామానుజ‌న్ మీద దృష్టి పడింది.

చివరికి ఆమెను మహేష్ కి తల్లిగా సెలక్ట్ చేసారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement