మైలవరంలో దేవినేని ఉమకు అనుకోని కష్టాలు!

టీడీపీ నేత దేవినేని ఉమకు అనుకోని కష్టాలు ఎదురయ్యాయి. ఉమ 2014-19లో కీలకమైన నీటిపారుదల శాఖను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఆ కాలంలో కృష్ణా జిల్లాలో ఆయన కీలక పాత్ర పోషించారు.2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర అవమానం ఎదురైంది.ఆ ఎన్నికలో ఉమ కూడా ఘోరంగా ఓడిపోయారు.

ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో ఉమాకు కొత్త తలనొప్పి వచ్చింది.నియోజకవర్గంలో ఉమ స్థానికేతరుడు.

ఆయన  నందిగామ నియోజకవర్గానికి చెందినవారు.దీంతో నియోజకవర్గ టీడీపీలోని ఓ వర్గం ఉమాకు వ్యతిరేకంగా పని చేస్తోంది.

బొమ్మసాని సుబ్బారావు 2014లో మైలవరం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌ ఆశించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.ఓట్లను చీల్చి ఉమా గెలుపును అడ్డుకున్నాడు.

Advertisement

ఆ త‌ర్వాత బొమ్మ‌సాని టీడీపీలో చేరి 2024కి మైల‌వరం టికెట్ ఆశించి.మైల‌వరంలో ఉమా వ్య‌తిరేక వ‌ర్గానికి నేతృత్వం వ‌హిస్తున్నారు.

ఇటీవల నియోజకవర్గంలో స్థానికేతర సమస్యలపై బొమ్మసాని సమావేశం నిర్వహించారు.పార్టీ బలోపేతం సభ పేరుతో బొమ్మసాని ఉమపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.2024లో బొమ్మసాని ఉమాకు సహకరించకుంటే 2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చేతిలో  ఎలా ఓడిపోయారో  అలానే మళ్ళి ఉమకు ఓటమి తప్పందని తెలుస్తోంది.బొమ్మసానికి అవకాశం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించుకుంటే ఉమాను వేరే చోటికి మార్చాల్సి వచ్చే అవకాశం ఉంది.

అధికారంలో వచ్చినప్పటి నుండి ఉమను వైసీపీ  టార్గెట్ చేస్తూ వస్తుంది.ఆయనపై అనేక కేసులను నమోదు చేసింది.  దీంతో కొన్ని రోజుల పాటు నియోజకవర్గంలో ఉమ తిరగడమే మానేశారు.

ఇప్పుడు మళ్ళి యాక్టీవ్ అవుందాం అనుకున్న సమసయంలో ఆయనకు కొత్త తల నొప్పి వచ్చి పడింది.అయితే ఈ పంచాయితీ చంద్రబాబు వద్దకు చేరినట్లు తెలుస్తుంది.వచ్చే ఎన్నికల్లో ఎవరూ చేస్తారనేది మరీ కొద్ది రోజుల్లో చంద్రబాబు తెల్చనున్నారు.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

 మైలవరం: దేవినేని ఉమకు అనుకోని కష్టాలు ఎదురయ్యాయి.

Advertisement

తాజా వార్తలు