మందు తాగితే 25 వేలు ఫైన్‌, ఊర్లో వారందరికి మటన్‌ వింధు ఇవ్వాల్సిందే

మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేదం అమలు అవుతున్న విషయం తెల్సిందే.మద్యం నిషేదం అమలులో ఉన్న ముఖ్య రాష్ట్రం గుజరాత్‌.

అక్కడ పూర్తిగా మద్యపాన నిషేదం అమలు అవుతుంది.అయితే స్థానికులు పక్క రాష్ట్రాల నుండి దొంగతనంగా మద్యంను తీసుకుని వచ్చి తాగుతూ ఉంటారు.

అలా చాలా కామన్‌గా జరుగుతుంది.

Muttonparty If Liquor Consumption In Gujarat Villages

  అయితే గుజరాత్‌ శివారులో రాజస్థాన్‌కు సమీపంలో ఉండే రెండు గ్రామాల్లో అస్సలు మద్యపాన నిషేదం జరగడం లేదు.అందుకే ఆ రెండు గ్రామాల వారు వింతైన ఒక నిబంధన తీసుకు వచ్చారు.గ్రామ పెద్దలు తీసుకు వచ్చిన ఆ నిబంధనతో అక్కడి వారు ఎవరైనా మందు తాగాలంటే భయపడి పోతున్నారు.

Muttonparty If Liquor Consumption In Gujarat Villages
Advertisement
Muttonparty If Liquor Consumption In Gujarat Villages-మందు తాగి

  గుజరాత్‌ రాష్ట్రం బనస్కంద జిల్లా ఖటిసితార గ్రామం.ఆ గ్రామం మద్యలో ఒక బోను వంటిది ఉంటుంది.ఎవరైనా మద్యం తాగి వచ్చినట్లయితే రాత్రి అంతా అందులో ఉంచుతారు.

ఒక రోజంతా బోనులో ఉన్న తర్వాత వెయ్యి రూపాయలు కడితేనే అందులోంచి బయటకు వదిలేస్తారు.అక్కడితే కథ పూర్తి అవ్వదు.

అందులో పడ్డ వారు వారం లోపు గ్రామంలోని వారందరికి కూడా 25 వేల రూపాయలు ఖర్చు చేసి మటన్‌తో దావత్‌ ఇవ్వాల్సి ఉంటుంది.దాదాపుగా 12 మంది జనాబా ఉండే ఆ గ్రామం మొత్తం ఆ రోజు వింధులో పాల్గొంటుంది.

Muttonparty If Liquor Consumption In Gujarat Villages

  ఈ శిక్షను కాదనే వారు, పాటించని వారికి గ్రామ బహిష్కరణ ఉంటుంది.గ్రామంలో వారికి ఎవరు కూడా సాయం చేయక పోవడంతో పాటు, వారిని ఎవరు కూడా పట్టించుకోకూడదు.అలా కాకుండా ఉండాలి అంటే 25 వేలు ఖర్చు చేసి గ్రామస్తులందరికి కూడా వింధు ఇవ్వాల్సిందే.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..

ఇది చాలా విభిన్నగా ఉన్నా కూడా గ్రామస్తులు అంతా కూడా దీనితో ఏకీభవిస్తున్నారు.

Advertisement

  ఎప్పుడైనా తాగితే పక్క గ్రామంలో పడుకోవడం లేదా గ్రామ శివారులో పొలాల్లో పండుకోవాలి.లేదంటే ఊర్లోకి వస్తే పాతిక వేలు మరియు వెయ్యి రూపాయలు గ్రామ పంచాయితికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఇదేదో మన ఊర్లో కూడా ఉంటే బాగుండేది కదా అనుకుంటున్నారా.

నాకైతే మా ఊర్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.వారంలో ఒక్కసారైనా మటన్‌ దావత్‌ వస్తుంది, మీరేమంటారు.?.

తాజా వార్తలు