Elon Musk TikTok : టిక్‌టాక్ లాంటి అద్భుతమైన యాప్ తీసుకొస్తున్న మస్క్..

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేసుబుక్ అనేవి స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఫేవరెట్ వీడియో షేరింగ్ ఆప్షన్స్‌గా మారాయి.వీటి ద్వారా చాలామంది ఫేమస్ కూడా అవుతున్నారు.

అయితే తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ షార్ట్ వీడియోల ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.వైన్ అనే షార్ట్-ఫామ్ వీడియో యాప్ పదేళ్ల కిందట ఒక ఊపు ఊపింది.

దీని కారణంగా చాలామంది పాపులర్ కూడా అయ్యారు.ఆ తర్వాత అది కొన్ని కారణాలవల్ల క్లోజ్ అయిపోయింది.

కాగా మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఓ పోల్ నిర్వహించారు.ఈ వైన్ యాప్‌ను తిరిగి తీసుకురావాలా? వద్దా అని తన ఫాలోవర్లను అడిగారు.4.92 మిలియన్ల ఓట్లలో 69 శాతం వైన్ తిరిగి రావాలని పిలుపునిచ్చారు. టిక్‌టాక్ పాపులర్ కాక ముందే ట్విట్టర్ దీనిని 2012లో కొనుగోలు చేసింది.

Advertisement

తరువాత ఈ షార్ట్-ఫామ్ వీడియో యాప్‌ను డిస్కంటిన్యూ చేసింది.టిక్‌టాక్‌కి పోటీగా మస్క్ దీనిని తీసుకొస్తే అందులోకి చాలామంది వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైన్ యాప్‌ను డోమ్ హాఫ్‌మన్, రస్ యూసుపోవ్, కోలిన్ క్రోల్ కలిసి డెవలప్ చేశారు.దీన్ని ట్విట్టర్ కొనుగోలు చేశాక మూడేళ్లలోనే ఈ యాప్ యాక్టివ్ యూజర్ల సంఖ్య 20 కోట్లకు చేరుకుంది.ఈ యాప్ ఎక్కువగా ఫేస్‌బుక్‌పై ఆధారపడి పనిచేసేది.

అయితే ఈ యాప్ పాపులారిటీ చూసి భయపడ్డ ఫేస్‌బుక్ దాని APIకి యాక్సెస్‌ నిలిపివేసింది.ఫలితంగా ఈ యాప్ యూజర్లకు దూరమైంది.

మళ్లీ దీన్ని అందరికీ అందుబాటులోకి తెస్తే ఇది నంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఆ నటుడు ఒక్క డైలాగ్ లోని పదానికి పారితోషికం 15 లక్షలట
Advertisement