చెప్పినా వినకుండా సెల్ఫీలు.. భర్త ముందే భయానక ఘటన.. భార్య మృతి

ఇటీవల సెల్పీలు, ఫొటోల మోజులో పడి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు.ఫొటోల కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో లైక్ ల కోసం స్టంట్లు చేస్తూ ప్రమాదానికి గురవుతున్నారు.ఫొటోలకు ఫోజులిస్తూ ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన తాజాగా ముంబైలో( Mumbai ) చోటుచేసుకుంది.

జులై 9న ఈ ఘటన జరగ్గా.ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జ్యోతి సనార్( Jyoti Sanar ) అనే 32 ఏళ్ల మహిళ తన భర్త ముఖేష్, ముగ్గురు పిల్లలతో కలిసి ముంబైలో వివాహరయాత్రకు వెళ్లింది.ఈ సందర్భంగా ముంబైలోని బాంద్రా బాండ్‌స్టాండ్‌ లోని సముద్రాన్ని చూసేందుకు వెళ్లారు.

Advertisement

సముద్రంలో( Sea ) భర్త, పిల్లలతో కలిసి మహిళ సేద తీరింది.అయితే ఈ సందర్భంగా సముద్రంలోకి వెళ్లి రాళ్లపై నిలబడి భర్తతో కలిసి ఫొటోలు దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

మహిళ రాయి మీద నిల్చున్న సమయంలో అలల తాడికి బ్యాలెన్స్ కోల్పోయింది.

దీంతో మహిళ నీటిలో పడగా.అలల ప్రభావానికి కొట్టుకుపోయింది.వెంటనే రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించారు.

రెస్క్యూ టీమ్( Rescue Team ) రంగంలోకి దిగి సముద్రంలో గాలించారు.అనంతరం ఆమె మృతదేహాన్ని గుర్తించి బయటకు వెలికితీశారు.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

ఫొటోలు దిగుతూ భర్త, పిల్లల కల్లముంటే మహిళ సముద్రంలో కొట్టుకుపోయి మరణించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.భార్య బ్యాలెన్స్ కోల్పోయిన సమయంలో ఆమెను పట్టుకునేందుకు భర్త ముకేష్ ప్రయత్నించాడు.

Advertisement

ఆమె చీరను పట్టుకోగా.చేతిని పట్టుకోలేకపోయాడు.దీంతో ఆమె నీళ్లల్లోకి జారిపోయింది.

జ్యోతి, ముకేష్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వీళ్లు విహారయాత్రలు చేస్తారని అధికారులు గుర్తించారు.

తొలుత వీళ్లు జుహు చౌపటీని సందర్శించాలని భావించారు.కానీ అక్కడ పరిమిత ప్రవేశం ఉండటంతో సముద్రం చూసేందుకు వచ్చినట్లు చెబుతున్నారు.

తాజా వార్తలు