జగన్ కు ముద్రగడ లేఖ ఇంత వినయం ఎందుకో ?

కాపులను బీసీల్లో చేర్చాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముద్రగడ పద్మనాభం కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.

గత టిడిపి ప్రభుత్వం అంతకు ముందు ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేర్చుతాము అంటూ హామీ ఇచ్చింది.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంగతి మరచి పోవడం తో ముద్రగడ పద్మనాభం పెద్దఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే.ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం ఓడిపోవడం, కాపు రిజర్వేషన్లపై ఇస్తాననిచెప్పి తాను చంద్రబాబు లా మోసం చేయలేనని, కేంద్రం ఇస్తే తాను అడ్డు చెప్పనని ఎన్నికలకు ముందే జగన్ బహిరంగంగా ప్రకటించారు.

Mudragadda Write The Letter To Jagan

ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో ముద్రగడ అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు.తాజాగా ఈ రోజు ఏపీ సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.కాపు రిజర్వేషన్ల బిల్లు గురించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గురించి జగన్ కు ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

కాపు రిజర్వేషన్ గురించి మీరు హామీ ఇవ్వలేదనే విషయాన్ని పద్మనాభం అవసరం లేకపోయినా జగన్ కు రాసిన లేఖలో గుర్తు చేశారు.గత ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల కాపు రిజర్వేషన్ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని, దాని కోసం మీరు ప్రధానమంత్రికి లేఖ రాయాలని కోరారు.

Mudragadda Write The Letter To Jagan
Advertisement
Mudragadda Write The Letter To Jagan-జగన్ కు ముద్రగడ

కాకపోతే జగన్ కు రాసిన లేఖలో రిజర్వేషన్ అంశాల కంటే తాను ఇప్పటివరకు పడిన, పడుతున్న ఇబ్బందులు గురించి ఎక్కువగా రాసుకొచ్చారు.గత టిడిపి ప్రభుత్వంలో వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తనకు పెద్దగా ఆస్థిపాస్తులు ఏమీ లేవని, అంతేకాకుండా జగన్ కోసం తాను ఎంతో చేశానని ఆ లేఖలో తన బాధను చెప్పుకున్నారు.అలాగే జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా తాను అన్ని విధాలా వైసిపికి సహకరించానని, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ కూడా గురయ్యానని ముద్రగడ ఈ లేఖలో ప్రస్తావించారు.

సొంత ఖర్చులతో ఓదార్పు యాత్ర ఏర్పాటు చేశానని ,అలాగే పాదయాత్ర సందర్భంగా భారీగా జనసమీకరణ కూడా చేశాను అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని మీ పార్టీలో ఉన్న మిగతా నేతలను అడిగితే తెలుస్తుంది అంటూ ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.తాను వైసీపీకి ఎంతగా ఉపయోగపడ్డానో మీ పార్టీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలను అడిగి తెలుసుకోవాలంటే తన బాధను ముద్రగడ వ్యక్తం చేశారు.అయితే కాపు రిజర్వేషన్ అంశాల కంటే తన వ్యక్తిగత ఇబ్బందులను, జగన్ ప్రభుత్వం ఏర్పడేందుకు తాను చేసిన కృషిని ఇప్పుడు హైలెట్ చేస్తూ ముద్రగడ చెప్పుకోవడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా పదవి కోరుకుంటున్నారా లేక వైసీపీలో చేరి కీలకం అయ్యేందుకు ఎలా లేఖ ద్వారా జగన్ కు తాను చేసిన మేలును గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు