వెంకటేష్ కి నచ్చిన కూడా దేవి సినిమా ఎందుకు చేయలేకపోయాడు

చాలామంది ఇండస్ట్రీకి వచ్చి సినిమాలో తీయాలని తెగ ఉబలాటపడుతూ ఉంటారు.డబ్బులుంటే చాలు ఎలాంటి సినిమా అయినా తీయొచ్చు అనుకుంటారు.

ఒక్కోసారి చేతులు కూడా కాల్చుకుంటూ ఉంటారు.అయితే వీరందరికీ భిన్నమైన వ్యక్తి నిర్మాత ఎమ్మెస్ రాజు. తన తండ్రి కారణంగా సినిమా ఇండస్ట్రీపై మక్కువ పెంచుకున్నారు రాజుగారు.1991లో మనవాడోస్తున్నాడు అనే సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు.ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.

ఆ తర్వాత శత్రువు, లాకప్ సినిమాలు కూడా మామూలు సినిమాలే.కానీ ఆ తర్వాత తీసిన ఆ స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా ఎమ్మెస్ రాజును దాదాపు రోడ్డుపైకి తీసుకొచ్చింది.

ఆ తర్వాత ఎన్నో చోట్ల అప్పు చేసి మరి అద్భుతమైన గ్రాఫిక్స్ తో చేసిన దేవి సినిమా ఎమ్మెస్ రాజుని మళ్లీ లాభాల బాట పట్టించింది.అయితే ఈ సినిమా అనుకున్న సమయంలో ఒక సంఘటన జరిగింది.

Advertisement

అప్పటికే వెంకటేష్ తో మంచి అనుబంధము ఉంది ఎమ్మెస్ రాజు కి.స్ట్రీట్ ఫైటర్ సినిమా వల్ల ఆస్తులు మొత్తం అమ్ముకున్న దశలో దేవి సినిమా కథ అనుకున్నారట అయితే అప్పటికి శ్యాం ప్రసాద్ రెడ్డి, వెంకటేష్ తో ఎమ్మెస్ రాజుకున్న అనుబంధం కొద్ది శ్యాం ప్రసాద్ రెడ్డి ఒక సలహా ఇచ్చారట అప్పుల్లో ఉన్నావు కదా వెళ్లి వెంకటేష్ ని దేవి సినిమా కోసం అడుగు నీకోసం ఖచ్చితంగా చేస్తాడు అని సలహా ఇచ్చారట.కానీ అందుకు ఎమ్మెస్ రాజు ఒప్పుకోలేదు.

నేను విజయాల్లో ఉన్నప్పుడు మాత్రమే సినిమా చేయమని అడుగుతానని మనసులో అనుకొని ఆ అవకాశాన్ని వదులుకున్నారట.ఆ సమయంలోనే భానుచందర్, షిజు, ప్రేమ, వనిత విజయ్ కుమార్ వంటి నటీనటులతో సినిమా పూర్తి చేశారు.ఆ చిత్రం తీయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టింది.

ఆ టైంలో ఆ సినిమాలో వచ్చినంత గ్రాఫిక్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మరే సినిమాలోను లేవు.ఇక ఎడిటింగ్ దశలో ఉన్న దేవి సినిమాను చూసిన వెంకటేష్ ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది అని జోష్యం చెప్పారట.

ఈ సినిమా కోసం నన్ను సంప్రదిస్తావని నేను అనుకున్నానని కానీ నేను ఊహించినట్టు నువ్వు నా దగ్గరికి రాలేదని ఒకవేళ వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా చేసి ఉండే వాడిని అన్నారట.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

అయితే మళ్లీ ఎప్పుడైనా సమస్యలు రావచ్చు, సినిమాలు హిట్ అవ్వచ్చు, ప్లాప్ అవ్వచ్చు కానీ నా దగ్గరికి రావాలనే ఆలోచన మాత్రం వదులుకోకు.మనం సినిమా తీయాల్సిందే అని చెప్పారట.అనుకున్నట్టే సినిమా విడుదల కావడం, బ్రహ్మాండంగా విజయం సాధించడం అన్నీ జరిగిపోయాయి ఆ సినిమా తర్వాత ఎంఎస్ రాజు నిర్మాణ సంస్థ ద్వారా దేవి పుత్రుడు, ఒక్కడు మనసంతా నువ్వే, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నీ స్నేహం, వర్షం, వంటి ఎన్నో హిట్టు సినిమాలు వచ్చాయి.

Advertisement

ఇక తర్వాత ఎమ్మెస్ రాజు దర్శకుడుగా కూడా మారి పలు సినిమాలు నిర్మించారు ప్రస్తుతం కూడా ఆయన దర్శకత్వం మరియు నిర్మాణం చేపడుతున్నారు.

తాజా వార్తలు