Mrunal Thakur: సౌత్ సినిమాలపై షాకింగ్ కామెంట్లు చేసిన మృణాల్.. హీరోయిన్లను అలా చూపిస్తారంటూ?

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌( Mrunal Thakur ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మృణాల్‌ ఠాకూర్‌ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా సీతారామం.

( Sitaramam ) గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ ఒక్క సినిమాతో ఊహించని విధంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

ఈ సినిమాతో భారీ హిట్ టాక్ ని తన ఖాతాలో వేసుకుంది.సీతారామం సినిమాలో సీతగా అద్భుతంగా నటించి యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

కాగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.హనురాఘవ పూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ నాని, హై నాన్నతో( Hi Nanna ) పాటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు మృణాల్‌.

Advertisement

అలాగే బాలీవుడ్‌లో రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి.అయితే హోమ్‌ టౌన్‌లో మంచి అవకాశాలు వస్తున్నా కూడా మృణాల్‌ మెయిన్ కాన్సన్‌ట్రేషన్ మాత్రం సౌత్ మీదే ఉంది.

సౌత్‌ సినిమాతో బాగా కనెక్ట్ అయిన మృణాల్‌, తెలుగు సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు.

తెలుగులో వర్క్ చేయటం ఇండస్ట్రీ పట్ల తన ఆలోచనా విధానాన్నే మార్చేసింది అంటోంది ఈ బ్యూటీ.సినిమా అనేది ఒక గ్లోబల్ ప్లాట్ ఫామ్ అన్న సంగతి సౌత్‌లో వర్క్‌ చేశాకే తెలిసిందని అన్నారు మృణాల్.ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.

సౌత్‌ సినిమాల్లో( South Movies ) ప్రతీ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది.పేపర్ మీద ఎంత బలంగా రాసుకుంటారో అంతే బలంగా తెర మీద చూపిస్తారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

అందుకే దక్షిణాదిలో వర్క్‌ చేసిన నటీనటులకు మంచి పేరు వస్తుంది అంటూ మన సినిమాలను ఆకాశానికెత్తేశారు మృణాల్‌ ఠాకూర్.

Advertisement

తాజా వార్తలు