బన్నీ అట్లీ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ ఈమేనా.. ఈ ఆఫర్ తో దశ తిరిగినట్టే!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ (Hero Allu Arjun)గురించి మనందరికీ తెలిసిందే.

పుష్ప 2 (Pushpa 2)మూవీతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్.

ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరగడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై ఇప్పుడు బోలెడు అంచనాలు ఉన్నాయి.

తర్వాత అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 తరవాత సినిమా కూడా అంతకుమించి ఉంటుంది అని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

ఇకపోతే బన్నీ తన నెక్స్ట్ సినిమాని అట్లీ కాంబినేషన్లో చేయబోతున్నట్లు ఇటీవల ఒక వీడియో రూపంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.ఈ ఒక్క వీడియోతో సినిమాపై ఉన్న అంచనాలను భారీగా పెంచేశారు అట్లీ.ఇకపోతే అల్లు అర్జున్(Allu Arjun) 22వ సినిమాకి అట్లీ(Atlee) దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సన్‌పిక్చర్స్‌ పతాకం పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

Advertisement

ఇందులో కథ రీత్యా ముగ్గురు కథానాయికలు కనిపించనున్నట్లు తెలుస్తోంది.కాగ అందులో ఒక పాత్ర కోసం మృణాల్‌ ఠాకూర్‌ను (Mrunal Thakur)రంగంలోకి దించనున్నారని సమాచారం.ఇప్పటికే ఆమెతో కథా చర్చలు పూర్తయ్యాయని ఇటీవలే తను లుక్‌ టెస్ట్‌ లోనూ పాల్గొందని తెలుస్తోంది.

మరోవైపు మిగిలిన రెండు హీరోయిన్ ల పాత్రల కోసం జాన్వీ కపూర్, దీపికా పదుకొణె (Janhvi Kapoor, Deepika Padukone)పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే జాన్వీతో చర్చలు పూర్తయ్యాయని దీపికతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న కథతో రూపొందుతున్న చిత్రమిది.సమాంతర ప్రపంచం, పునర్జన్మ కాన్సెప్ట్‌ ఈ కథలో మిళితమై ఉండనున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇది ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రీకరణ ప్రారంభించుకోనుందట.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.మరి అట్లీ, బన్నీ సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు