Mrunal Thakur : కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ఫ్లాట్ ఖరీదెంతంటే? 

కొంతమంది ఇండస్ట్రీలోకి వస్తూనే అద్భుతమైన విజయాన్ని, అంతకు మించిన క్రేజ్ ని సంపాదించుకుంటారు.

అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మృణాల్ ఠాగూర్( Mrunal Thakur ) ఒకరు.

ఈ బ్యూటీ కొంతకాలం క్రితం దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందించిన సీతారామం( Sita Ramam ) అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.ఈ సినిమాలో ఆమె నటన, అందం తో టాలీవుడ్ ప్రేక్షకులని కట్టిపడేసిందనే చెప్పాలి.

ఇక గత సంవత్సరం హాయ్ నాన్న( Hi Nanna ) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మరో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్( Family Star Movie ) సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది.

బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది ఈమె.దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే రీతిలో ముంబైలోని అంధేరి ప్రాంతంలో కొత్తగా ఒక ఫ్లాట్( Mrunal Thakur Flat ) కొనుగోలు చేసింది.గతంలో ఇది హీరోయిన్ కంగనా రౌనత్( Kangana Ranaut ) తండ్రి సోదరుడికి సంబంధించినది.

ఇప్పుడు దీన్ని మృణాల్ సొంతం చేసుకుంది.అయితే దీని నికర విలువ ఎవరికి తెలియదు కానీ 10 కోట్లు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు.ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే ముంబైకి చెందిన ఈమె సీరియల్ నటిగా కెరియర్ ప్రారంభించింది.

Advertisement

బాలీవుడ్ లో లవ్ సోనియా, సూపర్ 30, బత్లా హౌస్ తదితర చిత్రాలు చేసింది.ఉన్నంతలో ఓ మాదిరిగా గుర్తింపు తెచ్చుకుంది.అయితే 2022లో సీతారామం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

అక్కడి నుంచి సౌత్ లో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ కెరియర్ లో ముందుకి దూసుకుపోతుంది మృణాల్.కెరియర్ దృష్ట్యా ఆమె దూకుడు చూస్తుంటే త్వరలోనే హైదరాబాదులో కూడా ఒక సొంత ఇల్లు కొనుక్కున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

ఇక ఆమె అభిమానులు అందరూ ఆమె తదుపరి చిత్రం ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement