సీతారామం హిందీ రిలీజ్ పై మృణాల్ అమితమైన ఆనందం.. అందుకేనా?

ఆగష్టులో రిలీజ్ అయినా మంచి సినిమాల్లో సీతా రామం ఒకటి.టాలీవుడ్ కష్టాల్లో ఉన్న సమయంలో ఆగష్టులో వచ్చిన సినిమాలు కొద్దిగా ఉపశమనం లభించేలా చేసాయి.

ఈ సినిమా కూడా అదే కోవకు చెందుతుంది.సీతా రామం సినిమా రిలీజ్ ముందు అంత అంచనాలు లేకపోయినా రిలీజ్ తర్వాత మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సీతా రామం.యుద్ధం నేపథ్యంలో అందమైన ప్రేమ కథను మరింత ఎమోషనల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్.

మంచి ఫీల్ గుడ్ ఉన్న లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళంలో కూడా రిలీజ్ అయ్యి రెండు చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Advertisement

ఇది ఇలా ఉండగా మేకర్స్ ఇప్పుడు ఈ అందమైన ప్రేమ కథను హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు.అందుకే హిందీలో కూడా మేకర్స్ ప్రొమోషన్స్ స్టార్ట్ చేశారు.

ఈ క్రమంలోనే నిన్న ఈ సినిమా హిందీ ట్రైలర్ రిలీజ్ చేసారు.ఇది బాగా ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా హిందీ రిలీజ్ గురించి స్పందించారు.ఈమె కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో తన వంతు సహాయం చేస్తుంది.ఈమె బాలీవుడ్ కథానాయిక కావడంతో ఈమెకు అక్కడ కొద్దిగా ఫాలోయింగ్ ఉంది.

అందుకే ఈమె కూడా వరుస ప్రొమోషన్స్ చేస్తూ అక్కడ కూడా ఈ సినిమా విజయం సాధించడానికి కృషి చేస్తుంది.ఈ క్రమంలోనే ఈమె తన ఆనందాన్ని పంచుకుంది.

సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

ఈ సినిమాతో సౌత్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఇంతకంటే మంచి సినిమాతో నేను అరంగేట్రం కోరుకోను.నేను పొందుతున్న ప్రేమ అపురూపమైనదని.

Advertisement

హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి మరింత మందికి చేరుకోబోతున్నందుకు సంతోషిస్తున్నాను.అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.