కిషన్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ భేటీ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ కీలక సమావేశం అయ్యారు.ఈ మేరకు హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో భేటీ జరిగింది.

ఇందులో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు.ఈ క్రమంలోనే వర్గీకరణ అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇరు పార్టీలకు చెందిన నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాగా ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే.మరోవైపు ఇవాళ రాష్ట్రానికి రానున్న హోంశాఖ మంత్రి అమిత్ షా సాయంత్రం ఎమ్మార్పీఎస్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

ఎస్సీ వర్గీకరణపై ఆయన కీలక చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.

Advertisement
అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?

తాజా వార్తలు