'మిస్టర్ బచ్చన్ ' మూవీ రివ్యూ...రవితేజ కంబ్యాక్ ఇచ్చాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు చాలా మంచి సినిమాలను తీస్తూ ఇండస్ట్రీలో పేరు నిలబెడుతున్నారు.

ఇక మరికొంతమంది దర్శకులు చేసిన సినిమాలు మాత్రం సక్సెస్ ఫుల్ గా ఆడకపోగా యావరేజ్ సినిమాలుగా మిగులుతూ ఉంటాయి.

మరి ఇలాంటి క్రమంలోనే రొటీన్ సినిమాలు ఇండస్ట్రీలో చాలావరకు వస్తూనే ఉంటాయి.ఇక మాస్ మహారాజుగా తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న రవితేజ కూడా ఇప్పుడు మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మరి ఆయన చేసిన ఈ సినిమా సక్సెస్ అయిందా ? ఫెయిల్యూర్ అయిందా? అనేది మనం ఒకసారి డీటెయిల్ గా తెలుసుకుందాం.

కథ

Mr Bachchan Movie Review And Rating ,ravi Teja Mr Bachchan , Harish Shankar ,

ఈ సినిమాలో బచ్చన్ (రవితేజ) ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా పని చేస్తాడు.ఇక తన డ్యూటీ ని తను సిన్సియర్ గా నిర్వహించినప్పటికీ అది నచ్చని కొంతమంది పై అధికారులు అతన్ని సస్పెండ్ చేయిస్తారు.దాంతో ఆయన కొద్దిరోజుల పాటు ఊర్లో కెళ్ళి అక్కడే వాళ్ళ పేరెంట్స్ తో బతకాలని నిర్ణయించుకుంటాడు.

Advertisement
Mr Bachchan Movie Review And Rating ,Ravi Teja Mr Bachchan , Harish Shankar ,

ఇక అక్కడికి వెళ్లిన తనకి హీరోయిన్ భాగ్యశ్రీ పరిచయం అవుతుంది.అలాగే చాలా పెద్ద పొలిటిషియన్ అలాగే బిజినెస్ మ్యాన్ అయిన జగ్గయ్యతో రవితేజ( Ravi Teja ) కి కొన్ని క్లాశేష్ అయితే వస్తాయి.

ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్ చేసిన రవితేజ అక్కడ ఇలాంటి నల్లతనాన్ని పట్టుకున్నాడా లేదా అనే విషయం మీకు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

Mr Bachchan Movie Review And Rating ,ravi Teja Mr Bachchan , Harish Shankar ,

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే హరీష్ శంకర్( Harish Shankar ) తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాను కూడా రొటీన్ ఫార్ములాలో తెరకెక్కించారు.అసలు ఎక్కడ కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా నడిపించలేదు.అదే ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాతో మంచి హైప్ ను క్రియేట్ చేసుకుంటున్నా హరీష్ శంకర్ ఈ సినిమాను మాత్రం ఎందుకు ఇంతలా నెగ్లెక్ట్ చేశాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక రీమేక్ సినిమాని చేయాలంటే చాలా గట్స్ ఉండాలి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఒరిజినల్ ఫ్లేవర్ చెడగొట్టకుండా మన నేటి వీటికి తగ్గట్టుగా సినిమాను మార్చి సక్సెస్ సాధించాలి.అయితే ఈ విషయంలో హరీష్ శంకర్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాడు.

Advertisement

అలాగే మిక్కీ మేయర్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి భారీగా మైనస్ అయితే అయింది.ఇక ఆర్టిస్టుల దగ్గర నుంచి పర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో హరీష్ శంకర్ ఫెయిల్ అయ్యాడు.

ఏ క్రాఫ్ట్ లో కూడా అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే కనిపించలేదు.దానివల్ల ఈ సినిమా మీద మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ అయితే వస్తుంది.

టీమ్ లో ఉన్న అందరూ ఎవరి పనిని వాళ్లు సక్రమంగా చేసినట్లయితే ఇలాంటి నెగిటివ్ టాక్ అయితే వచ్చిండేది కాదు.ఇక ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

ముఖ్యంగా జగపతిబాబు, రవితేజ, భాగ్యశ్రీ, సత్య లాంటి నటులైతే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకోవడమే కాకుండా నటన పరంగా కూడా చాలా మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు.

ప్లస్ పాయింట్స్

క్లైమాక్స్ , రవితేజ, భాగ్య శ్రీ ల కెమిస్ట్రీ , కొన్ని డైలాగ్స్.

మైనస్ పాయింట్స్

రోటీన్ స్క్రీన్ ప్లే , ఎమోషన్ మిస్ అయింది , ట్విస్టులు లేకపోవడం.

రేటింగ్

ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.5/5.

తాజా వార్తలు