టీఎస్ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు.ఎమ్మెల్యే క్వాటర్స్ లోని క్యాంపు కార్యాలయంలో ఇరువురు సమావేశమైయ్యారు.

ఈ సందర్భంగా ఠాక్రేతో కలిసి కోమటిరెడ్డి అల్పాహారం చేశారు.కోమటిరెడ్డిని గాంధీభవన్ కు రావాల్సిందిగా ఠాక్రే కోరగా.

గాంధీభవన్ కు రాలేనంటూ క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.మరోవైపు ఠాక్రే సమీక్షలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి.

ముందుగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో ఆయన సమావేశం కానున్నారు.పీఏసీ మీటింగ్ పూర్తయ్యాక డీసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్స్ తో వరుస సమావేశాలు నిర్వహిస్తారు.

Advertisement
వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?