అభివృద్ధి చేయ‌లేని ప్రాంతం గురించి ఉద్య‌మాల‌టః సీఎం జ‌గ‌న్

అభివృద్ధి చేయలేని ప్రాంతం గురించి ఉద్య‌మాల పేరుతో నాట‌కాలు చేస్తున్నార‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు.మూడు రాజ‌ధానుల‌పై అసెంబ్లీలో ఆయ‌న ప్ర‌సంగించారు.

58 ఏళ్లుగా క‌లిసి ఉన్న రాష్ట్రం విడిపోతే చంద్రబాబు ఏనాడు ఉద్య‌మం చేయ‌లేద‌న్నారు.హైద‌రాబాద్ ను వ‌దిలి వెళ్లే ప‌రిస్థితి వ‌స్తే మాట్లాడ‌లేద‌ని విమర్శించారు.

వారు క‌ట్ట‌ని రాజధాని గురించి వెయ్యి రోజులుగా రియల్ ఎస్టేట్ ఉద్య‌మం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.పెత్తందారుల సొంత అభివృద్ధి కోస‌మే ఉద్య‌మాలు చేస్తున్నార‌ని సీఎం జ‌గ‌న్ ఆరోపించారు.

ఏ రంగంలోనైనా త‌మ వాళ్లు ఉండాల‌న్న‌దే వారి ఆలోచ‌న అని అన్నారు.అమ‌రావ‌తిపై త‌న‌కెలాంటి కోపం లేద‌న్న జ‌గ‌న్.

Advertisement

ఒక ప్రాంతం మీద వ్య‌తిరేక‌త ఉండ‌ద‌ని పేర్కొన్నారు.అన్ని ప్రాంతాలు బాగుండాలి.

ప్ర‌జ‌లు బాగుండాల‌నే త‌ప‌న త‌న‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు