2022లో అత్యంత ప్రజాదరణ పొందిన యోగాసనాలు ఏవో తెలుసా?

భారతీయ హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల రూపం అని అర్ధం.

మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది ఈ యోగా అని మన సాధు పుంగవులు పేర్కొంటారు.

యోగాని ఒక యాగంలాగా చేసే వాళ్ళను యోగులు అంటారు.ధ్యానయోగం అనేది ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది.

హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు అనేవి శరీరారోగ్యానికి, దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప జేయడంలో ప్రధానపాత్ర వహిస్తాయి.మోడీ రాకతో మన భారతీయ యోగా ప్రాధాన్యతను ఇంకాస్త దిగంతాలకు చేరువయ్యేలా కార్యక్రమాలు చేపడుతోంది మన కేంద్ర ప్రభుత్వం.

కాగా మరి కొన్ని రోజులలో 2022 సంవత్సరం ముగియబోతోంది.కరోనా తరువాత ఇంట్లోనే చాలా వరకు యోగా సాధన చేశారు దేశ ప్రజలు.

Advertisement

ఈ క్రమంలో 2022 సంవత్సరంలో బాగా ప్రాచుర్యం పొందే యోగాసనాల గురించి ఒక సర్వే జరిగింది.ఇపుడు వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

అందులో మొదటిది వజ్రాసనం. ఈ యోగాను మోకాళ్లపై కూర్చోవడం ద్వారా చేస్తారు.తిన్న తర్వాత ఈ యోగా చేయవచ్చు.

ఆ తరువాత ట్రెండింగ్ లో వున్న ఆసనం పేరు సుఖాసన. ఇది శరీర రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది.

ఈ ఆసనం చేయడానికి చాపపై కూర్చున్నప్పుడు రెండు మోకాళ్లను నేలపై ఉంచడానికి ప్రయత్నించండి.

How KYC, Fast Payouts And Self‑Exclusion Work For Crypto Users At WPT Global (Canada)
Roulette Lightning : A Revolution In A Classic Game — RNG ...

తరువాత ప్రజాదరణ పొందినది పర్వతాసనం. 2022 సంవత్సరంలో ఫిట్‌గా ఉండటానికి ప్రజలు పర్వతాసన అభ్యాసాన్ని ఎక్కువగా సాధన చేసారు.ఈ ఆసనం వేయాలంటే ముందుగా వజ్రాసనంలో కూర్చొని రెండు చేతులు, కాళ్ళను నేలపై సున్నితంగా ఉంచాలిల.

Advertisement

ఆతరువాత బరువును నేలపై ఉంచి, నడుమును త్రిభుజాకార ఆకారంలో పైకి చాచాలి.మనకి భారతీయ యోగాసన శాస్త్రాల్లో ఎన్నో ఆసనాలు ఉన్నప్పటికీ వీటిని ముఖ్యంగా ఎక్కువమంది ఫాలో అవుతున్నారు.