కొత్త లుక్ లో అదరగొట్టిన మోక్షజ్ఞ.. బాలయ్య అలా ప్లాన్ చేస్తే మోక్షు స్టార్ హీరో అవుతారా?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ( Nandamuri Natasinham Balakrishna )గురించి మనందరికీ తెలిసిందే.బాలయ్య  బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

రీసెంట్ గా బాలయ్య వరుసగా మూడు సినిమాలతో హిట్ కొట్టి హ్యాట్రిక్ ను అందుకున్న విషయం తెలిసిందే.కేవలం సినిమాల పరంగా కాకుండా రాజకీయపరంగా కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.

ఇది ఇలా ఉండే బాలయ్య బాబు అభిమానులతో పాటు నందమూరి అభిమానులు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

ఈ విషయంపై ఎన్నోసార్లు వార్తలు కూడా వినిపించాయి.కానీ ప్రతిసారి ఆ వార్తలు అవాస్తవాలుగా మిగిలిపోతూ వచ్చాయి.ఇకపోతే ఈ మధ్యకాలంలో నందమూరి మోక్షజ్ఞకు( Nandamuri Mokshajn ) సంబంధించిన ఏదో ఒక రకమైన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.

Advertisement

ముఖ్యంగా మోక్షజ్ఙ కు కూడా సినిమాల్లోకి రావాలనే ఆసక్తి బాగా పెరిగింది అని సన్నిహితుల బోగట్టా.కాగా ప్రస్తుతం బాలకృష్ణ ఇఫ్పుడు ఫుల్ సెటిల్డ్ గా వున్నారు.

రాజకీయంగా మంచి కంఫర్ట్ పొజిషన్ లో వున్నారు.అలాగే సినిమాల పరంగా కూడా మంచి ఊపు మీద వున్నారు.

కూతుర్లు ఇద్దరూ మంచి ఫ్యామిలీల్లో సెటిల్డ్ గా వున్నారు.

ఇప్పుడు మిగిలిన బాధ్యతల్లా కొడుకు మోక్షును హీరోను చేయడమే.అయితే అది అంత సులువుగా తీసుకునే నిర్ణయం కాదు.సరైన దర్శకుడు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

సరైన సబ్జెక్ట్, సరైన కథ ఏ తీరుగా, ఏ జానర్ లో ఎంటర్ చేయించాలి అన్నది బాలకృష్ణ ముందుగా డిసైడ్ కావాల్సి వుంది.మరీ పెద్ద డైరక్టర్లు కాదు.

Advertisement

మరీ కొత్త డైరక్టర్లు కాదు.ఇదంత సులువుగా డిసైడ్ అయ్యేది కాదు.

చాలా టఫ్ డెసిషన్ ఇది.సబ్జెక్ట్ సరైనది ఆర్గానిక్ గా దొరకాలి.సీనియర్ ఎన్టీఆర్ చాలా పద్దతిగా కే.విశ్వనాధ్ లాంటి మంచి దర్శకులతో కూడా బాలకృష్ణకు అప్పట్లో సినిమాలు సెట్ చేసారు.అంత మంది దర్శకుల వద్దా శిక్షణ పొందేలా చేసారు.

ఇప్పుడు బాలయ్య కూడా కొడుకు విషయంలో అలాగే ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.రాబోయే ఆరునెలల్లో ఎలాగైనా మోక్షు సినిమాను స్టార్ట్ చేయాలని బాలయ్య ఆలోచనగా తెలుస్తోంది.

అందువల్ల ఈ ఏడాదే ఎంట్రీ వుంటుందని తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే మోక్షజ్ఞ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఫోటోలలో పూర్తిగా మారి సరికొత్త లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంటున్నాడు మోక్షజ్ఞ.

తాజా వార్తలు