మోక్షజ్ఞ ఎంట్రీకి ఈ సంవత్సరంలో అయిన మోక్షం లభిస్తుందా..?

నందమూరి నట సింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు( Balayya Babu ) మాస్ హీరోగా ఎదగడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు.

ఆయన కొడుకు అయిన మోక్షజ్ఞ( Mokshagna ) కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి చాలా వార్తలైతే వస్తున్నాయి.

కానీ ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది.ఆ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికోసమే యావత్ తెలుగు సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Mokshagna Entry Will Get This Year Details, Mokshagna, Nandamuri Mokshagna, Moks

ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నట వారసులు వస్తున్నారని అనౌన్స్ అయిన వెంటనే ఫాస్ట్ గా సినిమాలను చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కానీ బాలయ్య బాబు కొడుకు విషయంలో మాత్రం చాలా జాప్యం జరుగుతుందనే చెప్పాలి.రోజు రోజుకి ఈ ఆలస్యం అనేది పెరిగిపోతుంది.

నిజానికి 2024వ సంవత్సరంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ( Mokshagna Entry ) ఉంటుందని బాలయ్య బాబు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినప్పటికి ఆ సంవత్సరం లో వర్కౌట్ అయితే కాలేదు.

Mokshagna Entry Will Get This Year Details, Mokshagna, Nandamuri Mokshagna, Moks
Advertisement
Mokshagna Entry Will Get This Year Details, Mokshagna, Nandamuri Mokshagna, Moks

ఇక 2025 సంవత్సరం స్టార్ట్ అయిన కూడా ఇంకా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు అయితే మొదలుపెట్టలేదు.నిజానికి బాలయ్య బాబు మోక్షజ్ఞ మొదటి సినిమాని ప్రశాంత్ వర్మతో( Prashanth Varma ) చేస్తున్నాడా? లేదంటే మరో దర్శకుడిని లైన్ లో పెట్టాడా అనే విషయం మీద ఇంకా సరైన క్లారిటీ అయితే రావడం లేదు.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న బాలయ్య తన కొడుకు విషయంలో మాత్రం చాలావరకు నిర్లక్ష్యం వహిస్తున్నాడనే చెప్పాలి.

మరి మోక్షజ్ఞ ఈ సంవత్సరమైనా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు