మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ స్టోరీ లైన్ ఇదేనా.. బాలయ్య అలాంటి రోల్ లో కనిపిస్తారా?

నందమూరి అభిమానులు నందమూరి మోక్షజ్ఞ( Nandamuri Mokshajna ) ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

అదిగో ఇదిగో అంటూ అభిమానులను ఊరిస్తూనే ఉన్నారు.

ఇక నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల కథనాలు కూడా వినిపించిన విషయం తెలిసిందే.అందులో కొన్ని వార్తలు గాసిప్స్ గా మిగిలిపోగా మరికొన్ని వార్తలు నిజమే అని తేలాయి.

ఇక ఈ మధ్యకాలంలో నందమూరి మోక్షజ్ఞ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ ని చూసిన అభిమానులు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అని ఫిక్స్ అయిపోయారు.అయితే ఇన్ని రోజులకు మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫామ్ అయ్యింది.

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Director Prashant Verma )సారథ్యంలో మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తోంది.ఇప్పుడు నిర్మాత కూడా దాదాపు ఫైనల్ అయ్యారు.మోక్షజ్ఞతో సినిమాకు చాలా మంది నిర్మాతలు రెడీ అయ్యారు.

Advertisement

దర్శకుడు ప్రశాంత్ వర్మ కావడం, సినిమాలో బాలయ్య కూడా ఒక స్పెషల్ రోల్ చేస్తారనే వార్తలు వుండడంతో నిర్మాతలు చాలా మంది రెడీ అయ్యారు.అయితే దాదాపుగా ఫైనల్ లిస్ట్ లో సుధాకర్ చెరుకూరి ( Sudhakar Cherukuri )పేరు చేరింది.

అయితే అఖండ 2 చేయాల్సి వున్నా, కుదరకపోవడం, మిగిలిన బ్యానర్లు అన్నింటికి ఇప్పటికే ఒక్కో సినిమా చేసి వుండడంతో బాలయ్య సుధాకర్ చెరుకూరి వైపు మొగ్గినట్లు తెలుస్తోంది.అయితే ఫైనల్ డిస్కషన్లు ఇంకా పెండింగ్ వుండనే ఉంది.

వన్స్ అది పూర్తయితే సినిమాకు మంచి భారీ ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుంది.

అది అక్టోబర్ లో ఉండవచ్చు.ఈ లోగా ఉండాలంటే శూన్యమాసం, ముహుర్తాలు లాంటి అడ్డంకులు ఉండవచ్చు అని వినిపిస్తోంది.అయితే ప్రశాంత్ వర్మ అయితే మంచి అద్భుతమైన మైథలాజికల్ టచ్ సోషియో ఫాంటసీ కథతో రెడీ అయినట్లు తెలుస్తోంది.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

అభిమన్యుడి పాత్రకు లింక్ వుండే లాంటి పాయింట్ ఏదో వుంటుందని తెలుస్తోంది.అర్జునుడి పాత్ర లాంటిది ఏమో బాలయ్య చేస్తారని వినిపిస్తోంది.మొత్తానికి ఒక భారీ సినిమాకు అయితే శ్రీకారం చుట్టడం కోసం డిస్కషన్లు జ‌రుగుతున్నాయి.

Advertisement

ఈ విషయంపై ఇంకా నిజానిజాలు తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు