నేను చెడ్డ నటుడిని కాదు.. కాంతారలో ఛాన్స్ కావాలి.. మోహన్ లాల్ సంచలన వ్యాఖ్యలు!

కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి( Rishab Shetty ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రిషబ్ శెట్టి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కాంతార.

( Kantara ) ఈ సినిమా ముందు వరకు కూడా హీరో రిషబ్ శెట్టి ఎవరు అన్న విషయం మనలో చాలామందికి తెలియదు.ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.

చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా రిషబ్ శెట్టి కెరియర్ లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

రిషబ్‌ హీరోగా, దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా 2022లో రికార్డులు సృష్టించింది.కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Mohanlal I Am Not Bad Actor Gave Me Chance Kantara Details, Mohanlal, Kantara, M
Advertisement
Mohanlal I Am Not Bad Actor Gave Me Chance Kantara Details, Mohanlal, Kantara, M

అంతేకాదు, ఉత్తమ నటుడు, ఉత్త పాపులర్‌ ఫిలిం విభాగంలో రెండు జాతీయ అవార్డులను సైతం అందుకుంది.కాగా ప్రస్తుతం ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు ప్రీక్వెల్‌ గా కాంతార: చాప్టర్‌ 1( Kantara: Chapter 1 ) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

అయితే ఈ ప్రీక్వెల్‌ లో మలయాళ స్టార్‌ మోహన్‌ లాల్( Mohanlal ) కీలక పాత్రలో నటించనున్నట్లు ఆ మధ్య ఒక వార్త తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ రూమర్‌ పై మోహన్‌ లాల్‌ స్పందించాడు.

దయచేసి నన్ను కాంతార సినిమాలో భాగం చేయమని మీరే అడగండి.నాకు ఒక పాత్ర ఇవ్వండి.

Mohanlal I Am Not Bad Actor Gave Me Chance Kantara Details, Mohanlal, Kantara, M

నాకు తెలిసి నేనేమీ చెడ్డ నటుడిని కాదు అని సరదాగా వ్యాఖ్యానించాడు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే మోహన్ లాల్ విషయానికి వస్తే.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ములక్కాయ‌ తిన‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే?

మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఎల్‌2: ఎంపురాన్‌ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సూపర్‌ హిట్‌ మూవీ లూసిఫర్‌ చిత్రానికి ఇది సీక్వెల్‌ గా తెరకెక్కింది.పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టింది.ఈ సినిమా ప్రచార కార్యక్రమాల సమయంలోనే మోహన్ లాల్ కాంతార సినిమాలో నటించడం గురించి స్పందించారు.

Advertisement

తాజా వార్తలు