పాన్ ఇండియా పార్టీ అంటూ మోడీ సంచలన వ్యాఖ్యలు..!!

దేశంలో బీజేపీ ఒక్కటే పాన్ ఇండియా పార్టీ అని మోడీ( Modi ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో బీజేపీ ( BJP )ఆఫీసు విస్తరణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

దేశవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని మోడీ వ్యాఖ్యానించారు.రెండు లోక్ సభ స్థానాలతో మొదలైన బీజేపీ ప్రస్థానం ఇప్పుడు 303 స్థానాలకు చేరుకుందని తెలిపారు.1984లోని చీకటి రోజులను ఈ దేశం ఎప్పుడూ కూడా మర్చిపోదు.భావోద్వేగా వాతావరణం మధ్య కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు.

ఆ తుఫానులో మనం కొట్టుకుపోయాం.కానీ నైతికత ఎక్కడా కూడా కోల్పోలేదు.

Modi Sensational Comments One And Only Pan India Party Is Bjp , Modi, Bjp, Congr

ఎవరిని కూడా నిందించలేదు అని స్పష్టం చేశారు.కాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా అవినీతిపరులంతా ఒక తాటిపైకి వస్తున్నారని ప్రతిపక్షాలపై మోడీ విమర్శలు చేశారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిని నిర్మూలించాం.

Advertisement
Modi Sensational Comments One And Only Pan India Party Is Bjp , Modi, BJP, Congr

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 5 వేల కోట్ల అవినీతి మాత్రమే బయటపడింది.బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా 10 లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును వెలికి తీయడం జరిగింది.

ఇదే సమయంలో పరారీలో ఉన్న 20 మంది ఆర్థిక నేరగాలను అదుపులోకి తీసుకున్నామని ప్రధాని మోడీ ఢిల్లీ బీజేపీ ఆఫీసులో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు