గోద్రా అల్లర్ల లో ప్రధాని పేరు తొలగింపు

2002 నాటి గోద్రా అల్లర్ల కేసులో కేంద్ర ప్రభుత్వం నియమించిన నానావతి కమిషన్ మోడీకి ఆ కేసులో క్లీన్‌ చిట్‌ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.

కాని దీన్ని పట్టించుకోని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మైనారిటీ లలో అభద్రతాభావం సృష్టించేందుకు నరేంద్ర మోడీ హిందూ పక్షపాతి అని ముస్లింల గురించి వాళ్ళ బాగు గురించి పట్టించుకోరని 2014 ఎన్నికల ముందు నుండి ప్రచారం చేస్తూ వచ్చారు.

ఈ వాదనను ప్రజలు తిరస్కరించారు అందుకే 2019 ఎన్నికల్లో మోడీ సర్కార్ కు రికార్డ్ మెజారిటీను కట్టబెట్టారు.అయితే తమ కుటుంబ సభ్యుల మృతికి నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీనే కారణమని ఒకతను గుజరాత్‌లోని సబర్కంతా దిగువ న్యాయస్థానంలో పిటిషన్ ను దాఖలు చేశారు.

Gujarat Riots: Court Orders Removal Of PM Modi's Name, PM Modi, Gujarat Riots, S

ఈ పిటిషన్ ను సుదీర్ఘకాలం పాటు విచారించిన ధర్మాసనం ఇందులో మోడీ ప్రమేయం లేదని ఈ పిటిషన్ ను తోసిపుచ్చుతూ పిటిషన్‌ నుంచి ఆయన పేరును తొలగిస్తున్నట్లు ఆదివారం తీర్పును వెలువరించింది.ప్రధాని మోడీకి గోద్రా అల్లర్లతో సంబంధం లేదని ధర్మాసనం తేల్చి చెప్పడంతో బిజేపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు