బీజేపీ నేత‌ల‌పై ఎమ్మెల్సీ క‌విత ప‌రువు న‌ష్టం దావా

తెలంగాణ రాజ‌కీయాల్లో ఢిల్లీ లిక్క‌ర్ స్కాం సంచ‌ల‌నంగా మారింది.ఈ స్కాంపై బీజేపీ నేత‌లు కేసీఆర్ కుటుంబంపై చేసిన ఆరోప‌ణ‌లు చ‌ర్చ‌నీయాంశమైన సంగ‌తి తెలిసిందే.

బీజేపీ నేత‌ల ఆరోప‌ణ‌ల‌పై ఎమ్మెల్సీ క‌విత తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.కేంద్ర ప్ర‌భుత్వంపై త‌న తండ్రి కేసీఆర్ చేస్తున్న‌ పోరాటాన్ని ఆప‌లేక‌.

తన‌పై అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.ఈ క్ర‌మంలో పరువునష్టం దావా వేస్తానని ప్ర‌క‌టించిన ఆమె.తెలంగాణలోని 33 జిల్లా కోర్టులలో పరువునష్టం దావా వేశారు.ఎమ్మెల్సీ క‌విత‌కు సంబంధాలు ఉన్నాయంటూ ఎంపీ ప‌ర్వేశ్ సాహిబ్ సింగ్ వ‌ర్మ‌, మాజీ ఎమ్మెల్యే మంజుందార్ సింగ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement