పట్టాభి పై గన్నవరం కోర్టులో పరువునష్టం దావా వేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కామెంట్స్ 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాను.

సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం,నాడు-నేడు పథకాలకు ఆయాకర్షితుడనై మద్దతు తెలిపాను.

అందుకు టీడీపీకి చెందిన కొంత నాపై సోషల్ మీడియా,కొన్ని పత్రికలు ద్వారా దుష్ప్రచారం చేశారు.టీడీపీకి మద్దతుగా ఉంటే ఒకలా బయటకు వస్తే మరోలా దుష్ప్రచారం చేయడం అలవాటు.

MLA Vallabhaneni Vamsi Filed A Defamation Suit Against Pattabhi In The Gannavara

విజయవాడలో సంకల్ప సిద్దిలో అవినీతి జరిగిందని కొన్ని మిడియాల ద్వారా తెలిసింది.రాజకీయ జీవితంలో ఒక్క అవినీతికి కూడా పాల్పడని నాపై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారు.

టీడీపీకి చెందిన పట్టాభి,బచ్చుల అర్జునుడు తీవ్ర పదజాలంతో అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేశారు.నేను,కొడాలి నాని కోట్లు అవినీతి చేసి బెంగుళూరులో ఆస్తులు కొన్నట్లు మీడియాలో ప్రకటనలు ఇచ్చారు.

Advertisement

ఈ విషయం పై గతంలో ఇచ్చిన నోటీస్ కి రిప్లై ఇవ్వలేదు.టీడీపీ నాయకులు రిప్లై ఇవ్వని కారణంగా నేడు గన్నవరం కోర్టుని ఆశ్రయించాను.

నాపై కావాలని తీవ్ర పదజాలంతో మీడియాలో ప్రకటనలు చేసిన వారికి శిక్ష వేయాలని కోరుతున్నాను.

Advertisement

తాజా వార్తలు