విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నిరాహారదీక్షకు కూర్చున్న ఎమ్మెల్యే..!!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సమావేశాలలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయటానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కేంద్రం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో విశాఖలో ఉన్న కార్మిక సంఘాలు మొత్తం రోడ్డెక్కి ఆందోళనలు నిరసనలు చేపట్టాయి.

కేంద్రం వెంటనే ఈ విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకోవాలని భారీ స్థాయిలో డిమాండ్ చేస్తున్నాయి.ఆంధ్రులు ఎంతగానో పోరాటం చేసి సాధించుకున్న ఇటువంటి సంస్థని ప్రైవేటీకరణ చేయడం ఏంటి అన్న విమర్శలు రాజకీయ పార్టీల నుండి కూడా వస్తున్నాయి.

పార్టీలకతీతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలామంది నేతలు స్పందిస్తూ ఉన్నారు.ఇలాంటి తరుణంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా స్పందించారు.

ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు అంటూ కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బుధవారం ఉదయం నిరాహార దీక్ష చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యే వాసుపల్లి దీక్ష చేయడానికి పూనుకొన్నారు.ఈ క్రమంలో వైసిపి సీనియర్ నాయకుడు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు. 

South Vizag Mla Vasupalli Ganesh Started Hunger Strike For Vizag Steel Plant, Vi
Advertisement
South Vizag Mla Vasupalli Ganesh Started Hunger Strike For Vizag Steel Plant, Vi
Advertisement

తాజా వార్తలు