Lasya Nanditha : ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( Lasya Nanditha ) యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

ప్రమాదంపై విచారణ చేస్తున్న పటాన్ చెరు పోలీసులు( Patancheru Police ) లాస్య నందిత కారు ఢీకొన్న టిప్పర్ ను గుర్తించారు.

అనంతరం టిప్పర్ ను పోలీసులు సీజ్ చేశారు.కాగా గత నెల 27న పటాన్ చెరు పరిధిలో రింగ్ రోడ్డుపై లాస్య నందిత కారు ప్రమాదానికి( Lasya Nanditha Car Accident ) గురై ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే.

లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు టిప్పర్ ను వెనుక నుంచి ఢీకొన్న తరువాత అదుపుతప్పి ఎడమవైపు దూసుకెళ్లి రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో లాస్య నందిత స్పాట్ లోనే చనిపోగా.పీఏ ఆకాష్( PA Akash ) తీవ్రంగా గాయపడ్డారు.

నిర్లక్ష్యం, అతివేగంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.

Advertisement
Bet Plays Mobile App And Mobile Experience : A Practical Guide For Canadian Players