మాజీ ఎమ్మెల్యే పైళ్ళపై ఎమ్మెల్యే కుంభం రీయాక్షన్...!

యాదాద్రి భువనగిరి జిల్లా:పదవి లేకుండా మూన్నెళ్లు కూడా ఆగలేరా, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష నాయకుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం కొట్లాడాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పార్టీ మార్పు ప్రచారంపై చురకలంటించారు.

గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం భువనగిరికి చెందిన ప్రతిపక్ష పార్టీ కీలక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ ప్రతిపక్ష నేత ప్రజల తరఫున కొట్లాడాలని,మూడు నెలలు ఓపిక లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.నియోజకవర్గ అభివృద్ధికి అధికార పార్టీ ఎంత ముఖ్యమో ప్రతిపక్షం అంతే ముఖ్యమని హితవు పలికారు.

MLA Kumbham's Reaction On Former MLA Paila, MLA Paila, Anil Kumar Reddy, Pailla
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

తాజా వార్తలు