టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి.. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓపెన్ సవాల్..!!

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ( MLA Kethi Reddy )తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.

తాడిపత్రి అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు.

అభివృద్ధిని నిరూపించుకోలేకపోతే.నువ్వు నీ కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని.ప్రశ్నించారు.గురువారం కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గం( Tadipatri Constituency ) ప్రశాంతంగా ఉంది.

MLA Kethi Reddy Open Challenge To TDP Leader JC Prabhakar Reddy TDP, MLA Keth

నా హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను.తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) రాజకీయ ఉనికి కోసం.

పాకులాడుతున్నారు.తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి.

Advertisement

అడ్డుపడుతున్నారు.అమృత్ స్కీం కింద తాడిపత్రి మున్సిపాలిటీకి కేంద్రం నుండి 52 కోట్లు రాకుండా అడ్డుకుంటున్నారు.

సొంత పొలాలకు మాత్రమే నీరు విడుదల చేసుకునే నైజం జేసీ ప్రభాకర్ రెడ్డిది.తెలుగుదేశం హయాంలో సాగునీరు అడిగితే రైతుల మోటర్లు లాక్కెళ్ళిన చరిత్ర జేసీ కుటుంబానిదే.

ప్రజలను పక్కదారి పట్టించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.టికెట్ల కేటాయింపు విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న తన మద్దతు ఉంటుందని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు.

బొంబాయి సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ బాలనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు