ఎంగిలి మెతుకుల కోసం లక్మీపార్వతి సిగ్గులేని ప్రకటనలు చేయడం తగదు - ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

చారిత్రక ప్రసిద్ధులు నందమూరి తారక రామారావు ఖ్యాతిని ఇనుమడింపజేయాల్సిన వ్యక్తులే అపఖ్యాతిపాలు చేస్తున్నారు.ఆయన పేరుకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు.

ఆయన గురించి తప్పుడుగా మాట్లాడుతుంటే సమర్థిస్తున్నారు.ఇది ఎలాంటి తప్పిదమో లక్ష్మీపార్వతితో పాటు ఎన్టీఆర్ అభిమానులు అర్థం చేసుకోవాలి.

Mla Gorantla Buchaiah Choudhary Counters To Lakshmi Parvathi Comments On Ntr Hea

మంత్రి దాడిశెట్టి రాజా బరితెగించి మాట్లాడారు.వీధి కుక్కలా బిహేవ్ చేశారు.

అన్న నందమూరి తారక రామారావు గురించి అసభ్యకర పదజాలం వాడారు.ఆయన అసమర్థుడు, చేతకానివాడని మాట్లాడటం అవివేకం.

Advertisement

ఇంతగా బరితెగించి మాట్లాడుతుంటే లక్ష్మీపార్వతి ఇంకా వైసీపీలో ఎలా మనగగలుతుతోందో లక్ష్మీపార్వతి సమాధానం చెప్పాలి.జగన్ రెడ్డి ప్రాపకం కోసం తెలుగుదేశం పార్టీ విధానాలను తాకట్టు పెట్టడం సరికాదు.

లక్ష్మీపార్వతి సిగ్గు లేకుండా ఎన్టీఆర్ పేరు మార్పును ఎలా సమర్థిస్తారు? మూడున్నర సంవత్సరాలుగా జగన్ తెలుగుకు గ్రహణం పట్టించారు.కళాసంస్కృతి వైభవానికి మంగళంపాడారు.

రాష్ట్రంలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అసలే లేవు.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్లేటు ఫిరాయించాడు.

రాజీనామా చేసి వెనక్కి తగ్గాడు.అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆయన ఏం సాధించారో ప్రజలకు చెప్పాలి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

జీత బత్యాలు లక్షల్లో పుచ్చుకొని రాష్ట్రానికి ఏం ఉద్ధరించారు.రాష్ట్రానికి మీరు చేసిందేమో చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు