టీపీసీసీ చీఫ్ పై ఎమ్మెల్యే గండ్ర విమర్శనాస్త్రాలు

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఉద్దేశ పూర్వకంగానే కాంగ్రెస్ నేతలు గొడవకు ప్లాన్ చేశారని ఆరోపించారు.

శాంతియుతంగా ఉన్న తమ పార్టీ కార్యకర్తలపై కావాలనే రాళ్లతో దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే గండ్ర మండిపడ్డారు.ఈ నేపథ్యంలో దాడి ఘటనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు.

అనంతరం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.తనను ఎదుర్కోనే దమ్ములేకనే చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

తను కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఎమ్మెల్యే గండ్ర స్పష్టం చేశారు.

Advertisement
చేతివాటం చూపించిన జొమాటో డెలివరీ బాయ్.. వీడియో వైరల్..

తాజా వార్తలు