Kaushik Reddy : ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేయాలి..: కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై( MLA Danam Nagender ) అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరామని బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి( Kaushik Reddy ) అన్నారు.

ఈ మేరకు ఈ నెల 18న స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవని చెప్పారు.

ఈ క్రమంలోనే స్పీకర్ ను మరోసారి కలుద్దామని వెళ్తే ఎవరూ లేరని తెలిపారు.కాంగ్రెస్ అధికారికంగా దానం నాగేందర్ ను ఎంపీ అభ్యర్థిగా( MP Candidate ) ప్రకటించిందన్నారు.

దానంపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.దానంపై అనర్హత వేటు వేస్తే స్పీకర్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు