పెరుగులో వీటిని క‌లిపి తీసుకుంటే.. మీ ఆరోగ్యం ప‌దిలం!

పెరుగు.రుచిలోనే కాదు బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ ముందుంటుంది.

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ తిన‌గ‌లిగే ఆహార‌మైన ఈ పెరుగు ఆరోగ్యాన్ని మ‌రియు చ‌ర్మాన్ని కవచంలా కాపాడుతుంది.అందుకే ఆరోగ్య నిపుణులు కూడా రోజుకు ఖ‌చ్చితంగా ఓ క‌ప్పు పెరుగు తీసుకోవాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంటారు.

అయితే పెరుగుతో పాటుగా కొన్ని ఆహారాల‌కు క‌లిపి తీసుకుంటే.మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.

మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా చూసేయండి.పెరుగులో కొద్దిగా స్వ‌చ్ఛ‌మైన తేనె క‌లిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జ‌రుగుతుంది.

Advertisement

ముఖ్యంగా ఈ కాంబినేష‌న్ ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపులో ఉన్న అల్స‌ర్లు దూరం అవుతాయి.పెరుగు మ‌రియు తేనె క‌లిపి తీసుకుంటే.

అది ఒక యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది.ఫ‌లితంగా, క‌డుపులో ఉండే ఇన్‌ఫెక్ష‌న్లు లేదా ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నాశ‌నం అవుతుంది.

అలాగే నేటి కాలంలో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.అయితే ఇలాంటి వారు పెరుగు తింటే మ‌రింత బ‌రువు పెరుగుతార‌ని న‌మ్ముతుంటారు.

కానీ, అది అపోహ మాత్ర‌మే.వాస్త‌వానికి జీల‌క‌ర్ర‌ను లైట్‌గా వేయించి పొడి చేసుకుని.ఆ పొడిని పెరుగు క‌లిసి తీసుకుంటే అధిక స‌మ‌స్య‌ను నియంత్రించుకోవ‌చ్చు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

అలాగే గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు నొప్పి, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డేవారు.పెరుగు వాము క‌లిపి తీసుకుంటే ఆ స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

Advertisement

అంతేకాదు, పెరుగులో వాము క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, చిగుళ్ల వాపు వంటి స‌మ‌స్యలు కూడా దూరం అవుతాయి.ఇక ఒక క‌ప్పు పెరుగుతో అర స్పూన్ న‌ల్ల మిరియాల పొడి క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటుగా జీర్ణ వ్య‌వ‌స్థ కూడా చురుగ్గా ప‌ని చేస్తుంది.

తాజా వార్తలు