తిరుమల కొండ పై.. ఈ తప్పులను అస్సలు చేయకూడదు..!

ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల పుణ్యక్షేత్రన్ని( Tirumala Temple ) ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం గా భక్తులు భావిస్తారు.

అయితే కొండ మీదకు వెళ్ళిన భక్తులు తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు.

ఆ తప్పులు ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.తిరుమల కొండ పై కొలువైన వెంకటేశ్వర స్వామి( Venkateswara Swamy ) తమ కష్టాలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు.

అందుకే ఎంతో శ్రమపడి ఏడుకొండల స్వామి దర్శనానికి వెళుతూ ఉంటారు.మొక్కులు ఉన్నవారు కాలినడకన తిరుమల కు వెళ్తూ ఉంటారు.

అయితే తెలిసి తెలియక కొందరు తిరుమల కొండపై ఈ తప్పులు చేస్తూ ఉంటారు.తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరూ స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు.

Advertisement
Mistakes To Avoid In Tirumala Darshanam Details, Tirumala Darshanam , Tirumala,

అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ముందు వరాహ స్వామిని( Varaha Swamy ) దర్శించుకోవాలి.

Mistakes To Avoid In Tirumala Darshanam Details, Tirumala Darshanam , Tirumala,

ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలి.తిరుమలను ఆది వరాహక్షేత్రంగా పిలుస్తారు.శ్రీమహావిష్ణువు భూదేవిని రక్షించి ఇక్కడే కొలువైనట్లు ప్రతీతి.

విష్ణుమూర్తి( Vishnumurthy ) వైకుంఠాన్ని వీడి శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించిన తర్వాత తిరుమల కొండపై ఉండేందుకు తనకు 100 అడుగుల స్థలాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీ వరాహ మూర్తిని కోరాడు.అందుకు ఆయన అంగీకరించి ఆపై ప్రధమ దర్శనం, పూజ, నైవేద్యం తనకే జరగాలని సూచించారు.

ఇందుకు శ్రీనివాసుడు సమ్మతించినట్లు పురాణాలలో ఉంది.తిరుమల అర్చక స్వాములు మొదది తప్ప మిగిలిన రెండిటిని ఇప్పటికీ పాటిస్తున్నారు.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..

ఆ మొదటిది పాటించాల్సింది తిరుమలకు వెళ్లే భక్తులే.

Mistakes To Avoid In Tirumala Darshanam Details, Tirumala Darshanam , Tirumala,
Advertisement

అందుకే భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామి నీ దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలి.తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లిన కొంత మంది సందర్శకులు షాపింగ్, విందులు, వినోదం అంటూ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు.అలా ఉద్దేశంతో అస్సలు వెళ్ళకూడదు.

అంతేకాకుండా కొత్తగా వివాహమైన వారు ఆరు నెలల వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్లకూడదన్న నియమం కూడా ఉంది.అలాగే కొంత మంది ప్రజలు దొంగ దర్శనాలు చేసుకుంటారు.

మోసాలు చేసి దర్శనాలు చేసుకుంటే ఆ ఫలితం కలగదని పండితులు చెబుతున్నారు.అలాగే తిరుమలలో పూసిన పుష్పాలను మహిళలు అలంకరించకూడదు అనే నిబంధన ఉంది.

ఈ నియమాలను భక్తులు ఉల్లంఘించకూడదని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు