మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ వెంటనే విడుదల చేయాలి:మైనార్టీ మోర్చా

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 యేండ్లు కావస్తున్నా ఇప్పటివరకు మైనారిటీ కుటుంబాలకు ఎలాంటి లోన్సు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని,మైనార్టీ ముస్లింలకు వెంటనే సబ్సిడి లోన్స్ ఇప్పించాలని మంగళవారం నల్లగొండ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కి వినతిపత్రం అందచేశారు.

అనంతరం మైనార్టీ మోర్చ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ పాషా మాట్లాడుతూ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ సబ్సిడీ రుణాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.

లేని పక్షంలో బీజేపీ మైనార్టీ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు.అదేవిధంగా మైనార్టీ కుటుంబాలు జీవనోపాధి కొరకు ఏదైనా ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా,రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోవడం చేత మైనార్టీ ముస్లిం సోదరులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మైనార్టీ సోదరులకు సబ్సిడీ లోన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం చేత, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాలు తీసుకొని ఆ యొక్క రుణాలకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.మైనారిటీ ముస్లిం ప్రజలు కిరాయి ఇంట్లో ఉంటూ కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నారని,తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు జీవనం సాగిస్తున్నారని,వారి యొక్క స్థితిగతులను చూసినట్లయితే చాలా దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు వెంటనే విడుదల చేసి ముస్లిం మైనార్టీ వారికి అండగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గడ్డం మహేష్,మహమ్మద్ జావీద్,షోయబ్ పాల్గొన్నారు.

Advertisement
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు