ఈటల పై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఫైర్.. !

తెలంగాణలో రాజకీయ యుద్ధం, కురుక్షేత్రాన్ని తలపించేలా సాగుతుంది.ఈటల ఒక్కరు ఒకవైపుండగా, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మూకుమ్మడిగా మాటల దాడికి చేస్తున్నారు.

అసలు ఈటలకు రాజకీయ బిక్ష పెట్టిందే కేసీఆర్ అనేలా విమర్శలు చేస్తుండటం తెలంగాణ ప్రజలను ఆశ్చరపడేలా చేస్తుందట.ఇలా నాయకులు నోటి కొచ్చినట్లుగా మాట్లాడుతుండటంతో స్వయంగా కేసీఆర్ కూతురు కవిత ఎన్నికల్లో ఓడిపోయిందిగా, అలాగే దుబ్బాకలో కూడా టీఆర్‌ఎస్‌ ఘోరపరాజయాన్ని మూట గట్టుకుందిగా, మరి కేసీఆర్ ఫోటో చూసి ఓట్లేసే జనం కవితను ఎందుకు తిరస్కరించారో, దుబ్బాకలో ఎందుకు ఓడించారో వివరణ ఇవ్వాలంటూ ఈటల అనుచరుల మనసులో మాటనట.

Minister Srinivas Goud Comments On Etela Rajender, Telangana, TRS, Minister Srin

ఇకపోతే ఈటల చేస్తున్న రాజకీయం పై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఫైర్ అయ్యారు.ఈటల తన తప్పులు కప్పి పుచ్చుకునేందుకే రాజకీయ భవిష్యత్‌ను ఇచ్చిన సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

మొత్తానికి ఈటల పై టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు రాజకీయ ఎత్తుగడలో భాగమే అని అనుకుంటున్నారట కొందరు.

Advertisement

తాజా వార్తలు