పవన్ కల్యాణ్‎పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు పాలనలో యువత కోసం పవన్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

యువనేస్తం పథకం గురించి ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.ప్రశ్నించడానికే పుట్టానన్న పవన్ అప్పుడేం చేశారని నిలదీశారు.

పవన్ జనసేన శ్రేణుల లక్ష్యాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.తానే సీఎం అభ్యర్థి అని పవన్ ఎందుకు ప్రకటించరని నిలదీశారు.

చంద్రబాబు చెప్పే ఏ విషయంలోనూ వాస్తవం ఉండదని మండిపడ్డారు.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు