సీతక్క కు పీసీసీ అధ్యక్ష పదవి ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) అత్యంత సన్నిహితరాలిగా ముద్రపడిన తెలంగాణ మంత్రి ధనసరి సీతక్కకు త్వరలోనే ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు.

ఒకపక్క ముఖ్యమంత్రిగా పరిపాలన చూడాల్సి రావడం, మరోవైపు పార్టీ బాధ్యతలు చూడడం కష్టతరంగా మారిన నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ కు( Telangana Congress ) కొత్త అధ్యక్షులను నియమించాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది .ఈ క్రమంలోనే పలువురు పేర్లను పరిశీలనకు తీసుకుంది.ఈ జాబితాలో పార్టీ సీనియర్ నేతలు జగ్గారెడ్డి , మహేష్ కుమార్ గౌడ్ , మధు యాష్కీ, సీతక్క ఉన్నారు .అయితే సీతక్క వైపే పార్టీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తోంది.

పిసిసి అధ్యక్ష పదవి సీతక్కకు( Seethakka ) కాకుండా, మరో నేత ఎవరికిచ్చినా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉండడం తో, సీతక్కవైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.అంతే కాకుండా రేవంత్ రెడ్డి సైతం సీతక్క కు పార్టీ బాధ్యతలను అప్పగించే విషయంలో సానుకూలంగా ఉండడంతో ఆమె పేరు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.ఎప్పటి నుంచో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని( Telangana Congress President ) మార్చాలని చూస్తున్నారు .లోక్ సభ ఎన్నికల తరువాత పిసిసి మార్పు ఉంటుంది అనే సంకేతాలు పంపడంతో, తాజాగా రేవంత్ స్థానంలో ఎవరిని ఫైనల్ చేయబోతున్నారనేది అందరికీ ఆసక్తికరంగానే మారింది.

సీతక్క కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎస్టి సామాజిక వర్గం ఆదరణ పొందడమే కాకుండా , మహిళల నుంచి కాంగ్రెస్ పై సానుకూలత పెరుగుతుందని అధిష్టానం పెద్దలు అంచనా వేస్తున్నారట .దీంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు సీతక్కకి అప్పగించే అవకాశం కనిపిస్తుంది.అదే కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళగా సీతక్క కు ప్రత్యేక గుర్తింపు రానుంది.

Advertisement
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

తాజా వార్తలు