దసరా రోజు జబర్దస్త్‌ స్టేజ్ పై రీ ఎంట్రీ ఇచ్చిన రోజా.. ఫ్యాన్స్ హ్యాపీ

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్ కార్యక్రమంతో సుదీర్ఘ కాలం పాటు ఎంటర్టైన్మెంట్ ను అందించిన రోజా ఇటీవల మంత్రి పదవి రావడంతో పూర్తిగా టీవీ షో లకు దూరమైన విషయం తెలిసిందే.

జబర్దస్త్ అభిమానులు ప్రేక్షకులు రోజా అని బాగా మిస్ అవుతున్నారు.

ఆమె లేని లోటు జబర్దస్త్ లో కనిపిస్తుంది అంటూ జబర్దస్త్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా జబర్దస్త్ నుండి ఆమె వెళ్లి పోయిన తర్వాత చాలా మంది కమెడియన్స్ కార్యక్రమాన్ని వదిలేసి వెళ్లి పోయారు అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు జబర్దస్త్ స్టేజీ పై రోజా కనిపించ లేదు.ఎట్టకేలకు ఆమె ఈటీవీ లో తిరిగి కనిపించబోతోంది.

దసరా సందర్భం గా టెలికాస్ట్ కాబోతున్న ప్రత్యేక కార్యక్రమం లో రోజా సందడి చేయబోతున్నారు.

Advertisement

ఆమె రెగ్యులర్ గా ఈటీవీ కార్యక్రమాలకు వస్తారు అని కొందరు భావిస్తున్నారు.కానీ మంత్రిగా ఉన్న ఆమె కేవలం దసరా ఎపిసోడ్ లో మాత్రమే కనిపించబోతున్నారని ముందు ముందు జబర్దస్త్ లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఆమె కనిపించబోదు అంటూ బుల్లి తెర వర్గాల వారు అధికారికంగా క్లారిటీ ఇస్తున్నారు.వచ్చే ఎన్నికల తర్వాత ఆమె రాజకీయ పరిస్థితిని బట్టి జబర్దస్త్ లో చేసేది లేనిది క్లారిటీ ఉండే అవకాశం ఉందని పుకార్లు షికారులు చేస్తున్నాయి.

మొత్తానికైతే ఈటీవీలో అప్పుడప్పుడైనా ఇలా గెస్ట్ గా రోజా రావడం ను ఆమె యొక్క అభిమానులు మరియు జబర్దస్త్ యొక్క ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు.దసరా ఎపిసోడ్ కోసం ఈటీవీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రోజా చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కారణంగా తప్పకుండా ఆమెకు మంచి వెల్కమ్ అన్నట్లుగా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున సక్సెస్ చేస్తారని, ఈటీవీ మరియు మల్లెమాల వారు నమ్ముతున్నారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు