ప‌నిలో ప‌నిగా పెళ్లి పనుల్లో ప్ర‌చారం..! ఇప్పటినుంచే మంత్రి స‌న్నాహాలు..!!

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కొత్త ప్ర‌చారానికి తెర‌లేపార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.ఇంట్లో జ‌రిగే వేడుక‌ను కూడా రాజ‌కీయంగా క‌లిసొచ్చేలా చేసుకుంటున్నార‌ని అంటున్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌లు అంటున్న నేప‌థ్యంలో ఇప్ప‌టినుంచే ప‌నిలో ప‌నిగా మొద‌లెడితే అయిపోతుంది అనుకున్నారో ఏమో.మంత్రి ఇంట్లో వేడుక అంటే ఆ జిల్లా మొత్తం తెలుస్తుంది.ఇంత‌కంటే ఏ భారీ స‌భ‌లు పెట్టినా అంత క్రేజ్ రాదేమో అన్న‌ట్లు పెళ్లి కార్డుతో పాటు ఓ గిఫ్ట్ ని కూడా ప్లాన్ చేశారు.

అయితే అందులో వేడుక‌కు సంబంధించింది కాకుడా రాజ‌కీయంగా ఇస్తున్న‌ట్లు ఫొటోలు ద‌ర్శ‌న‌మిచ్చాయి.విష‌యం ఏంటంటే పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో త్వరలోనే బాజా భజంత్రీలు మోగనున్నాయి.ఆయన కుమారుడు.

డాక్టర్ నయన్ రాజ్ వివాహం ఈ నెల 20న గ్రాండ్ గా జరగనుంది.ఈ నేప‌థ్యంలోనే భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

Advertisement

అయితే కొడుకు పెళ్లంటే ఎంత గ్రాండ్ గా చేస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు.సీఎం, రాష్ట్ర స్థాయి నేత‌లు మొద‌లు కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు అంద‌రూ వ‌స్తుంటారు.

అయితే ప‌నిలో ప‌నిగా రాజ‌కీయంగా కూడా క‌లిసి వ‌చ్చేలా ప్లాన్ చేశార‌ని అంటున్నారు.కుమారుడి పెళ్లిని కూడా ఆయన ఎన్నికల ప్రచారంగా మార్చారనే గుసగుస వినిపిస్తోంది.

నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డియారాలు గిఫ్ట్ గా.

కొడుకు డాక్టర్ నయన్ రాజ్ వివాహం సందర్భంగా మంత్రి పువ్వాడ పెళ్లి కానుకగా ప్రత్యేకంగా గోడ గడియారాలను తయారు చేయించారు.ఈ గడియారాల్లో ఎక్కడా.పెళ్లి కుమారుడి ఫొటో అయితే లేదుగానీ.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

ఒకవైపు.కేసీఆర్.

Advertisement

మరోవైపు.కేటీఆర్. ఇంకో వైపు.పువ్వాడ అజయ్ కుమార్ ఉన్న ఫొటోలను ముద్రించారు.

ఇక వీటిని నియోజకవర్గం వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు.అన్ని డివిజన్లలోని కార్పొరేటర్లకు.

ఈ కానుకలను ప్రజలకు పంపిణీ చేసే బాధ్యతలను అప్పగించారు.శుభలేఖతోపాటు.

గడియారాలను కూడా పంపిణీ చేస్తుండ‌టం విశేషం.ఈ పరిణామాలను చూస్తున్న ప్ర‌తిప‌క్షాలు.

ప్ర‌త్య‌ర్థులు ఎన్నిక‌ల ప్ర‌చారం అంటున్నారు.

తాజా వార్తలు