కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్

కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.హైదరాబాద్ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లు కాదా అని ప్రశ్నించారు.

హైదరాబాద్ నుంచి కేంద్రానికి పన్నులు వెళ్లడం లేదా అని అడిగారు.కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లు తెలంగాణ నుంచి వెళ్తే తెలంగాణకు మాత్రం రూ.1.68 లక్షల కోట్లు ఇస్తున్నారని తెలిపారు.తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

అయితే కేంద్రం సహకరించినా లేకపోయినా హైదరాబాద్ లో 250 కిలోమీటర్ల మేర‌ మెట్రోను తీసుకు వస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు