వచ్చే ఎన్నికలలో పోటీ విషయంపై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలను వైసీపీ అధినేత జగన్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు.సొంతంగా సర్వేలు చేయించుకుని వాటి ఆధారంగా టికెట్లు కేటాయించాలని డిసైడ్ అయ్యారు.

ఇదే సమయంలో ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను ఎలాంటి మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తున్నారు.ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో కొంతమందిని పక్కనపెట్టి మరి కొంతమందిని ఇతర నియోజకవర్గాలకు పంపించడం జరిగింది.

Minister Jogi Ramesh Key Comments On The Issue Of Competition In The Upcoming El

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో పోటీ విషయంపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎక్కడ నుంచి పోటీ చేయాలి అనే విషయం సీఎం జగన్ నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.అధిష్టానం అందరికీ సముచిత స్థానం కల్పిస్తోంది.

Advertisement
Minister Jogi Ramesh Key Comments On The Issue Of Competition In The Upcoming El

నా అనుచరులు పెడన నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు.అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే.

సీటు, పోటీ విషయంలో పార్టీ నిర్ణయమే శిరోధార్యం.అని అన్నారు.

ఇదే సమయంలో పార్టీలో తనకు ఎవరితోను శత్రుత్వం లేదని అందరూ మిత్రులే అని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే మరోపక్క వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ విడుదల చేయటానికి పార్టీ పెద్దలు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు