చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపాటు

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలకు అన్నం తినడం నేర్పింది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు అన్నారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

టీడీపీ స్థాపించక ముందు తెలంగాణ ప్రజలు జొన్నలు, రాగులు తిన్నారని చంద్రబాబు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు కామెంట్స్ తో వరి సాగు లెక్కలు తీశానన్నారు హరీశ్ రావు.

తెలంగాణలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యిందన్న మంత్రి ఏపీలో 16 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని తెలిపారు.మరి ఇప్పుడు ఎవరు ఎవరికీ అన్నం పెడుతున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతోందన్నారు.తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోందని పేర్కొన్నారు.

Advertisement

రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని వెల్లడించారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు