పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు.. మంత్రి బొత్స ఫైర్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్నారు.

పవన్ ఉగ్రవాది అయితే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని తెలిపారు.సెలబ్రెటీ పార్టీ నేత ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

మూడు రాష్ట్రాలు అని మేము అనలేదన్న మంత్రి బొత్స మూడు రాజధానులే తమ పార్టీ విధానమని పేర్కొన్నారు.రిపబ్లిక్ డే రోజు ఎవరైనా హుందాగా మాట్లాడతారన్నారు.

కానీ పవన్ మాత్రం పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.కేఏ పాల్ కు, పవన్ కు తేడా ఏం లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

పవన్ లాంటి వ్యక్తులను చూస్తే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అనిపిస్తుందన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే పవన్ ఎందుకు అంత బాధ పడుతున్నారని మంత్రి బొత్స ప్రశ్నించారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement