జగనన్న ఇళ్లపై పవన్ విమర్శలకు మంత్రి బొత్స కౌంటర్

ఏపీలో ఇళ్లు లేని నిరుపేదల కోసం సీఎం జగన్ పాటు పడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

జగనన్న ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు.

గతంలో వైఎస్ఆర్ పేదలకు ఇళ్ల నిర్మాణం మహాయజ్ఞంలా చేపట్టారన్నారు.దాన్నే సీఎం జగన్ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.71 వేల ఎకరాల భూమి సేకరించి ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని పేర్కొన్నారు.ఇప్పటివరకు రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.

నిస్వార్థంగా, కమిట్ మెంట్ తో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని రాజకీయ పార్టీగా భావించడం లేదని స్పష్టం చేశారు.రూ.15 వేల కోట్ల అవినీతి జరిగిందని పవన్ ఆరోపిస్తున్నారన్నారు.కానీ తప్పుడు ఆరోపణలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని వెల్లడించారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement