ఖరీఫ్ సీజన్ కు సాగు నీరు‌ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

విజయవాడ: ఖరీఫ్ సీజన్ కు సాగు నీరు‌ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కాలువలకు నీరు వదిలిన ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఢిల్లీ రావు.

ఈరోజు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల, డిమాండ్ ను బట్టి మరింత పెంచే అవకాశం.తొలుత శాస్త్రోక్తంగా పూజ చేసి, కొబ్బరి కాయ కొట్టిన మంత్రి అంబటి రాంబాబు.

పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారె కాలువలోకి వదిలిన ప్రజాప్రతినిధులు, అధికారులు.మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.

కృష్ణా, గుంటూరు జిల్లాల కాలువలకు నీరు విడుదల చేశాం.పూర్వం జూన్ నెలాఖరులో, జులై మొదటి వారంలో వదిలేవారు.

Advertisement

సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తో నెల ముందే నీరు ఇచ్చాం.త్వరగా ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే అవకాశం ఉంది.

ప్రకృతి విపత్తు ల నుంచి కూడా రైతుకు ఇబ్బంది ఉండదు.సాగర్ నుంచి రాకుండానే పులిచింతల లో‌ 34 టి.ఎం.సి ల నీరు ఉంది.అక్కడి నుంచే నీటిని రైతుల కు అందిస్తున్నాం.

పట్టిసీమ నుంచి కుడా నీరు తెచ్చే అవసరం లేదు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీటి కొరత అనేదే లేదు.

ఈ యేడాది పట్టిసీమ నుంచి నీరు తెచ్చే అవసరం ఉండదు.పులిచింతల లో 34టి.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

ఎం.సి.ల నీరు సరి పోతుంది.వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సమృద్ధిగా వర్షాలు పడతాయని నిరూపణ అయ్యింది.

Advertisement

వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటే ముందస్తు గా చర్యలు తీసుకుంటాం.కృష్ణా వరదల నుంచి క్షేమంగా ఉండేలా ప్రజల.

కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారు.ప్రజల కోసం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.

మంత్రి జోగి రమేష్ కామెంట్స్.రైతుల మేలు కోసం నెల రోజుల ముందే నీరు విడుదల చేశాం.జగన్మోహన్ రెడ్డి పాలనలో దేవుడు కరుణించాడు.

వరుణ దేవుడి కరుణ కటాక్షాలతో జలాశయాలు నిండు కుండలా ఉన్నాయి.రైతుల కు పంటలు పండి మంచి దిగుబడి వచ్చింది.

నాలుగేళ్లల్లో రైతుల నుంచి ధాన్యం కూడా కొనుగోలు చేశారు.వైయస్ హయాంలో పులిచింతల శర వేగంగా పనులు చేశారు.

పులిచింతల లో‌34 టి.ఎం.సి ల నీరు నిల్వ చేసుకున్నాం.కృష్ణా డెల్టా కు నీటి కొరత లేకుండా ఇస్తున్నాం.పోలవరం వ్యయం పెంచి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందేలా చేశారు.12,900కోట్ల నిధులు కేంద్రం నుంచి తెప్పించ గలిగారు.పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఎపి అన్నపూర్ణ గా పంటలతో కళకళలాడుతుంది.ఢిల్లీ వెళ్లి ఏం పీకారు అన్న వారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో తెలుసుకోవాలి.

తాజా వార్తలు