మద్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది - మంత్రి అంబటి రాంబాబు

ఎన్నిక ఏదైనా ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయంపై ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడారు.

‘‘తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది.బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్‌ కూడా కోల్పోయింది.

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలుస్తున్నారు.ప్రతీ ఎన్నికల్లోనూ ప్రజలు భారీ మెజార్టీ అందిస్తున్నారు.

  మధ్యవర్తి ప్రమేయం లేకుండా రాష్ట్రంలో నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందుతున్నాయి.మద్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.

Advertisement

ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది.మద్యంలో కాదు.

టీడీపీ మెదడులోనే విషం ఉంది.టీడీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

అందుకే ఈ కుట్రలు.టీడీపీ విష ప్రచారంతో మాపై ఉన్న అభిమానం తగ్గిపోదు.

ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆపలేరు’’ అని అంబటి రాంబాబు అన్నారు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు