అప్పుడే ర‌జ‌నీ పార్టీలోకి భారీ వ‌ల‌స‌లు..!

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కొత్త రాజకీయ పార్టీ ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో లేదో ? అప్పుడే ఆ పార్టీలో సీట్ల కోసం క‌స‌ర‌త్తులు, ఖ‌ర్చీఫ్ వేయ‌డాలు స్టార్ట్ అయ్యాయి.

పార్టీ ఏర్పాటుపై ఫ్యాన్స్‌తో భేటీ అయ్యి అభిప్రాయాలు తెలుసుకున్న ర‌జ‌నీ మ‌రోసారి వారితో భేటీ అయ్యాక ఆగ‌స్టు నాట‌కి పార్టీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న చేసే దిశ‌గా ముందుకు సాగుతున్నాడు.

ఇదిలా ఉంటే ర‌జ‌నీ పార్టీ పెట్ట‌క ముందే ఆయ‌న పార్టీలోకి భారీ వ‌ల‌స‌లు జ‌రుగుతున్నాయి.ర‌జ‌నీ 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి ముందుకు వెళ్లాల‌ని యోచిస్తోన్న టైంలో క‌మ‌ల‌నాథులు సైతం ర‌జ‌నీ - మోడీ భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ర‌జ‌నీ కొత్త పార్టీలోకి తాము వెళ‌తామ‌ని, త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని హీరోయిన్లు మీనా, న‌మిత ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.ర‌జ‌నీ పార్టీకి సినీగ్లామ‌ర్ ఎలాగూ ఉంటుంది.

ఇక పొలిటికల్ గ్లామ‌ర్ కూడా వ‌చ్చేసింది.ప‌లు పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు ర‌జ‌నీ పార్టీలోకి వ‌చ్చేందుకు రెడీ అయిన‌ట్టు టాక్‌.

Advertisement

అన్నాడీఎంకేకు చెందిన పాండ్యరాజన్, గతంలో రెండుసార్లు ఎంపీగా, యూపీఏ హయాంలో మంత్రిగా చేసిన ఎస్‌ జగత్‌రక్షకన్‌ను కూడా తన పార్టీలోకి తీసుకోవాలని రజనీ వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక చెన్నై న‌గ‌రానికి చెందిన ప్ర‌ముఖ అన్నాడీఎంకే నేత ఒక‌రు, కాంగ్రెస్‌ నేత కరాటే త్యాగరాజన్‌ కూడా రజనీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

ఇక ర‌జ‌నీ పార్టీ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే కొంద‌రు ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకేకు చెందిన కొంద‌రు ఎంపీలు సైతం ఆయ‌న బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు త‌మిళ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వార్త‌లు జోరుగా ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు