2700 ఎకరాల్లో మైకేల్‌ జాక్సన్‌ ఇల్లు... ఆ ఇంటి ప్రత్యేకతలు తెలుసా?

రెండు దశాబ్దాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా మైకేల్‌ జాక్సన్‌ అంటే మ్యూజిక్‌ అభిమానులు పడి చచ్చేవారు.

ఆయన పాటల కోసం, ఆయన్ను చూసేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు.

దేశాల అధినేతల నుండి సామాన్యుల వరకు అంతా కూడా ఆయన్ను అభిమానించారు.ఈ భూమిమీద పాప్‌ రారాజుగా వెలుగు వెలిగిన మైకేల్‌ జాక్సన్‌ అత్యతం వివాదాస్పదంగా మరణించిన విషయం తెల్సిందే.

చిన్న పిల్లలను అత్యంత నీచంగా లైంగికంగా వేదించాడంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు.ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మరియు డబ్బు అంతా కూడా మంచులా కరిగి పోయాయి.

ప్రస్తుతం మైకేల్‌ జాక్సన్‌ సంపాదించుకున్న ఒకే ఒక్క ఆస్తి ఆయన ఇల్లు మిగిలి ఉంది.ఇల్లు అంటే అలాంటి ఇలాంటి ఇల్లు కాదు.

Advertisement
Michael Jacksons Restored Neverland Ranch Is Back On The Market-2700 ఎకర�

సాదారణంగా ఇల్లు అంటే పేద వాడికి వంద గజాల్లో ఉంటుంది.బాగా డబ్బున్న రాజకీయ నాయకుడికి లేదా వ్యాపారస్తుడికి ఒకటి లేదా రెండు మూడు ఎకరాల్లో ఇల్లు ఉంటుంది.

కాని మైకేల్‌ జాక్సన్‌కు మాత్రం 2700 ఎకరాల్లో ఇల్లు ఉంది.ఆ మొత్తం సామ్రాజ్యంను కూడా మైకేల్‌ నిర్మించుకున్నాడు.

తన ఇంటి ఆవరణలో జూ, పార్క్‌లు, చిన్న పెద్ద థియేటర్లు ఎన్నో ఏర్పాటు చేయించుకున్నాడు.ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఇల్లుగా మైకేల్‌ జాక్సన్‌ ఇల్లు అయిన నెవర్‌ ల్యాండ్‌కు గుర్తింపు ఉంది.

Michael Jacksons Restored Neverland Ranch Is Back On The Market

ప్రతి వారం పేద పిల్లలకు అక్కడ ఉచితంగా ప్రవేశం కల్పించి జూ, పార్క్‌, థియేటర్లలో సినిమాలు చూపించే వారు.అది మైకేల్‌ మంచి మనసుతో చేస్తే కొందరు మాత్రం పిల్లలను అక్కడకు రప్పించుకుని, వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు అంటూ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.అలా మైకేల్‌ జాక్సన్‌ పతనం ప్రారంభం అయ్యింది.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

నెవర్‌ ల్యాండ్‌ ప్రాభవం కోల్పోవడం మొదలు అయ్యింది.

Advertisement

మైకేల్‌ జాక్సన్‌ మరణంకు ముందు నెవర్‌ ల్యాండ్‌ విలువ వేల కోట్లలో ఉండేది.కాని ప్రస్తుతం నెవర్‌ ల్యాండ్‌ను కేవలం 220 కోట్లకు ఒక వ్యక్తి దక్కించుకునేందుకు సిద్దం అయ్యాడు.2015వ సంవత్సరంలో నెవర్‌ ల్యాండ్‌ను వేలం వేసేందుకు సిద్దం అవ్వగా 640 కోట్ల రూపాయల ధరకు వచ్చింది.అయితే అప్పుడు ఆ రేటు తక్కువగా భావించారు.

రోజు రోజుకు మైకేల్‌ జాక్సన్‌ ఇల్లు ప్రాభవం కోల్పోవడంతో పాటు, దారుణంగా విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో చేసేది లేక ఎంతో అంత అన్నట్లుగా ఆ ఇంటిని ఆధీనంలో ఉంచుకున్న బ్యాంకులు అమ్మేసేందుకు సిద్దం అయ్యాయి.విలాసాలకు, నెవర్‌ ల్యాండ్‌ మెయింటెన్స్‌ కు మైకేల్‌ భారీ ఎత్తున ఖర్చు చేయడం జరిగింది.

అందుకే ఆయన అప్పుల పాలయ్యాడు.

తాజా వార్తలు