వరంగల్ లో మెట్రో పరుగులు.. త్వరలో పనులు స్టార్ట్..!

తెలంగాణ ప్రభుత్వం వరంగల్ ప్రజలకు శుభవార్త అందించనుంది.హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

10 లక్షలు దాటిన వరంగల్ లో ఇప్పటికి అన్ని రంగాల్లో మెల్లగా రాణిస్తోంది.విద్యారంగంలో ముందజలో ఉంది.

ఐటీ రంగంలో నిలదొక్కుకుంటోంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని త్వరలో మెట్రోరైలును ఏర్పాటు చేయబోతుంది.

వరంగల్ లో నియో మెట్రో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ఫలించనున్నాయి.మహారాష్ట్రలోని మహా మెట్రో తరహాలో వరంగల్ లో మెట్రో ఏర్పాటును ప్రయత్నాలు సాగుతున్నాయి.

Advertisement

ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గత డిసెంబర్ లో మెట్రో ప్రతినిధులు సర్వే నిర్వహించారు.కాజీపేట నుంచి పోచమ్మ మైదాన్ మీదుగా వరంగల్ రైల్వేస్టేషన్ వరకు దాదాపుగా 15 కిలోమీటర్ల వరకు రైలు మార్గాన్ని నిర్మించబోతున్నారు.దీనికి సంబంధించి రూ.1400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.వరంగల్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

నగర ట్రాఫిక్, రవాణా వ్యవస్థ, ప్రజల ఆర్థిక పరిస్థితులపై అధికారులు అధ్యాయనం చేస్తున్నారు.త్వరలో రూ.కోటితో మహా మెట్రో డీపీఆర్ ను రూపొందిస్తోంది, త్వరలో వరంగల్ మెట్రో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు